'దే దే..' రకుల్‌ 'బ్రా'బోయ్‌ గ్లామర్‌.!

మరిన్ని వార్తలు

ఒకప్పుడు కుర్రహీరోలందరికీ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇప్పుడు రూటు మార్చేసింది. ముదురు రొమాన్స్‌కి సై అంటోంది. బాలీవుడ్‌లో రకుల్‌ 'దేదే ప్యార్‌ దే' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అజయ్‌దేవగణ్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే అజయ్‌దేవగణ్‌ సినిమాలో హాఫ్‌ సెంచరీ ఏజ్‌ ఉన్న వ్యక్తిగా నటిస్తే, ఆయనతో రొమాన్స్‌ చేసే కుర్ర లవర్‌గా రకుల్‌ నటిస్తోంది. 

 

ఇంత ఏజ్‌ గ్యాప్‌ ఉన్న వ్యక్తితో రకుల్‌ చేసే రొమాన్స్‌ కాస్త ఇబ్బందికరంగా ఉన్నా, ఈ సినిమాపైనే రకుల్‌ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా ఈ సినిమాతో హిట్‌ కొట్టాలని కసిగా ఉంది. ఇక సినిమాలో రకుల్‌ పాత్రను చాలా హాట్‌గా డిజైన్‌ చేశారు డైరెక్టర్‌. లేటెస్ట్‌గా ఈ సినిమా నుండి విడుదలైన ఓ పార్టీ సాంగ్‌కి సంబంధించిన స్టిల్స్‌లో రకుల్‌ గ్లామర్‌ కాక పుట్టిస్తోంది.

 

లైట్‌ పింక్‌ కలర్‌ డిజైనర్‌ బ్రాలో రకుల్‌ అందాలతో కవ్విస్తోంది. ఆ పక్కనే ఆమె ఏజ్డ్‌ లవర్‌ అజయ్‌దేవగన్‌ కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే, ఇటు టాలీవుడ్‌ విషయానికి వస్తే, రకుల్‌ 'మన్మధుడు 2'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా రకుల్‌ సీనియర్‌ హీరో నాగార్జునతో జత కడుతుండడం విశేషం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS