న‌వ‌ర‌స ట్రైల‌ర్ టాక్‌: మేటి న‌టుల క‌ల‌యిక‌

By iQlikMovies - July 27, 2021 - 12:01 PM IST

మరిన్ని వార్తలు

సూర్య‌, విజ‌య్ సేతుప‌తి, సిద్ధార్థ్‌, బాబీ సింహా, అర‌వింద‌స్వామి, ప్ర‌కాశ్‌రాజ్‌, రేవ‌తి, అంజ‌లి, అధ‌ర్వ‌ముర‌ళి. ప్ర‌గ‌తి... ఒక‌రా, ఇద్ద‌రా? ఎటు చూసినా హేమా హేమీలే. వీళ్లంతా క‌లిసి న‌టిస్తే ఎలా ఉంటుంది? ఆ అరుదైన సంద‌ర్భం చూడాలంటే `న‌వ‌ర‌స‌` వ‌చ్చే వ‌ర‌కూ ఆగాలి. లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం నిర్మాణంలో తెర‌కెక్కిన వెబ్ సిరీస్ ఇది. తొమ్మిది ఎపిసోడ్లూ,.. తొమ్మిది ర‌సాలూ. క‌లిస్తే... న‌వ‌ర‌స‌. నెట్ ఫ్లిక్స్ కోసం త‌యారైన ఈ వెబ్ సిరీస్ ఆగ‌స్టు అతి త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈరోజున ట్రైల‌ర్‌వ ఇడుద‌ల చేశారు.

 

ప్రేమ‌, హాస్యం, కోపం, దుఃఖం, ధైర్యం, భ‌యం, జుగుప్స‌, ఆశ్చ‌ర్యం, శాంతి.... ఇవ‌న్నీ న‌వ‌ర‌సాలూ. ఒక్కో అనుభూతి. ఒక్కో భావోద్వేగం. ఇవ‌న్నీ నవ‌ర‌స‌లో చూడొచ్చు. ఒక్కో ఎపిసోడ్‌.. ఒక్కో అనుభూతి ప్ర‌ధానంగా సాగ‌బోతోంది. ఒక్కో ఎపిసోడ్ నీ ఒక్కో ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. నిజంగా ఇది అరుదైన క‌ల‌యిక అని చెప్పుకోవాలి. ట్రైల‌ర్లో అన్ని ర‌కాల భావోద్వేగాల్నీ చూపించారు. ఓ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ చూస్తామ‌న్న ఆశ ఈ ట్రైల‌ర్ చూస్తే క‌లుగుతోంది. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాలు, మేటి న‌టులు, అత్యున్న‌త సాంకేతిక నిపుణుల క‌ల‌యిక‌.. ఈ న‌వ‌ర‌స‌. లాక్ డౌన్ వ‌ల్ల త‌మిళ చిత్ర‌సీమ చాలా న‌ష్ట‌పోయింది. సినీ కార్మికుల్ని ఆదుకోవ‌డానికి సెల‌బ్రెటీలు చాలా చేశారు. న‌వ‌ర‌స కూడా అందులో భాగ‌మే. మ‌ణిర‌త్నం ఆధ్వ‌ర్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఎన్ని సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అవుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS