బిగ్ బాస్ హౌస్ లో జరిగే సంఘటనలు ఇప్పుడు హెడ్ లైన్స్ గా మారుతున్నాయి.
అలాంటిదే నిన్న జరిగిన ఒక సంఘటన. ప్రతివారం లాగానే ఆదివారం రోజున హౌస్ మేట్స్ ని కలిసేందుకు వచ్చిన ఎన్టీఆర్.. హౌస్ మేట్ అయిన నవదీప్ కి ఒక పెద్ద ఝలక్ ఇచ్చాడు.
అదేంటంటే- అందరితో మాట్లాడుతూ, ఒక్కసారిగా నవదీప్ ని హౌస్ నుండి తన బ్యాగ్స్ ని ప్యాక్ చేసుకుని వచ్చేసేయండి, ఒక చిన్న ఎమర్జెన్సీ అని ఎన్టీఆర్ చెప్పగానే నవదీప్ తో సహా అందరు షాక్ కి గురవుతారు.
కారణం అడగగా- మీ ఇంటిలో రూ 500, రూ 1000 నోట్లు పోలీసులకి దొరికినట్టు చెప్పాడు. దీనితో అందరు మరింత ఆందోళనకి గురయ్యారు. ఈ షాక్ లో అందరు ఉండగానే, నవదీప్- ఇది జస్ట్ జోక్, కేవలం సరదాగే టెన్షన్ పెట్టాను అని చెప్పేసరికి. అందరు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
నవదీప్ ని ఎన్టీఆర్ ఇలా టెన్షన్ పెట్టించడానికి కారణం- నవదీప్ హౌస్ లోకి వచ్చిన రోజు హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ- బయట కొత్త రూ 1000 నోట్లు దొరుకుతున్నాయి అని చెప్పి ఒక ప్రాక్టికల్ జోక్ వేసాడు. దానికి కౌంటర్ గానే తాను ఇలా చేసినట్టు ఎన్టీఆర్ చెప్పాడు.
ఈ సన్నివేశం జరుగుతున్నంత సేపు మాత్రం ఇటు ప్రేక్షకులకి అటు హౌస్ మేట్స్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది.