ఆ హీరో విలన్‌గా సెటిలైపోయాడా?

మరిన్ని వార్తలు

‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా పరిచయమైన 'నవీన్‌ చంద్ర'కు తొలి సినిమానే మంచి పేరు తీసుకొచ్చింది. ఈ కుర్రాడిలో మంచి నటుడు దాగున్నాడే  అని ఆడియన్స్‌తో పాటు, ఇండస్ట్రీ దృష్టినీ విశేషంగా ఆకర్షించాడీ యంగ్‌స్టర్‌. అందుకే ఆయనకు హీరోగా కన్నా, విలక్షణ పాత్రలే ఎక్కువగా దొరుకుతున్నాయి. ముఖ్యంగా హీరో లుక్స్‌ కన్నా, మనోడిలో విన్‌ లుక్సే పుష్కలంగా ఉన్నట్లున్నాయ్‌. అందుకే ఈ మధ్య వరుసగా విలన్‌ పాత్రలతో మెప్పిస్తున్నాడు. వెరీ లేటెస్ట్‌గా నవీన్‌ చంద్రకు మరో బంపర్‌ ఆఫర్‌ తగిలింది. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న ‘బాక్సర్‌’ సినిమాలో నవీన్‌ చంద్ర మెయిన్‌ విలన్‌గా ఎంపికయ్యాడు.

 

‘బాక్సర్‌’తో రింగ్‌లో తలపడేందుకు తనను తాను ఫిట్‌నెస్‌ పరంగా  సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడట నవీన్‌ చంద్ర. బాక్సర్‌ లుక్స్‌ కోసం వరుణ్‌ మేకోవర్‌ ఎలా ఉందో చూసేశాం. ఇక అంతకు ఏమాత్రం తగ్గకుండా, విలన్‌ అప్పియరెన్స్‌ కూడా ఉండాలి కదా. అందుకే ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, బాక్సింగ్‌లోనూ స్పెషల్‌ ట్రైనింగ్‌ అవుతున్నాడట. తన పాత్ర గురించి చెబుతూ, తన పాత్రలో ఓ ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌ ఉంటుందనీ సినిమాకి అదే కీ పాయింట్‌ అనీ.. ముందే మనోడు ఉత్కంఠ పెంచేస్తున్నాడు.

 

కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రీసెంట్‌గా సెట్స్‌ మీదికి వెళ్లింది. ప్రస్తుతం హీరోపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తదుపరి షెడ్యూల్‌లో నవీన్‌ చంద్ర జాయిన్‌ కానున్నాడట. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్‌ నటించిన ‘అరవింద సమేత..’లో నవీన్‌ చంద్ర యంగ్‌ విలన్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే రీసెంట్‌గా తమిళ్‌లో ధనుష్‌ హీరోగా రూపొందిన ‘పటాస్‌’ (తెలుగులో లోకల్‌ బాయ్‌) చిత్రంలోనూ నవీన్‌ చంద్ర విలన్‌గా నటించాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS