నాని విలన్‌ ఎన్టీఆర్‌కి విలన్‌ అవుతాడా?

By iQlikMovies - April 18, 2018 - 12:21 PM IST

మరిన్ని వార్తలు

'నేను లోకల్‌' సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించాడు యంగ్‌ హీరో నవీన్‌ చంద్ర. 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కుర్రోడు తొలి సినిమాతోనే యాక్టింగ్‌లో తన రూటే సెపరేట్‌ అనిపించుకున్నాడు. అయితే ఆ తర్వాత హీరోగా అరా కొరా సినిమాలే చేస్తున్నాడు. 

కానీ హీరోగానే సెటిలైపోవాలని మనోడి లేదన్న విషయం చాలా సార్లే చెప్పాడు. క్యారెక్టర్‌ నచ్చి, కథ నచ్చితే, ఎలాంటి క్యాకెర్టర్‌లోనైనా నటించేందుకు తాను సిద్ధమని అంటున్నాడు. ఆ కోవలోనే ఎన్టీఆర్‌ చిత్రంలో ఛాన్స్‌ కొట్టేశాడనీ తాజా సమాచారమ్‌. త్రివిక్రమ్‌ - ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో నవీన్‌ చంద్ర కోసం ఓ స్పెషల్‌ క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశాడట మాటల మాంత్రికుడు. సినిమాకి ఆ క్యారెక్టర్‌ ఎంతో కీలకమట. అయితే అది నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రనా? లేక ఇంకేమైనా కొత్త యాంగిల్‌ బయటికి తీస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. 

ఏ క్యారెక్టర్‌నైనా డీల్‌ చేయగల సత్తా ఉన్నోడు మనోడు. అలాంటిది త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అంటే ఇంకా చెలరేగిపోతాడు. మొత్తానికి నవీన్‌ చంద్ర కెరీర్‌లో ఈ సినిమా టర్నింగ్‌ పాయింట్‌ అనే చెప్పాలి. ఒకవేళ ఈ ఛాన్స్‌ చిక్కితే, ఇంతవరకూ చిన్న చిన్న సినిమాలతోనే సరిపెట్టుకున్న నవీన్‌ చంద్ర ఈ సారి బంపర్‌ ఛాన్స్‌ కొట్టేసినట్లే. హారికా హాసినీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS