పెళ్లిపై రౌడీ ఒపీనియన్‌ ఇదే!

మరిన్ని వార్తలు

నాకప్పుడే పెళ్లేంటీ.? నేనింకా చిన్న పిల్లాడినే అంటున్నాడు ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఈయన నటించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ వర్‌’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లిపై ఆయన అభిప్రాయం చెప్పాల్సి వచ్చింది. ‘ఒకప్పుడు ప్రేమ, బ్రేకప్‌.. ఇవన్నీ అర్ధమయ్యేవే కావు, తికమకగా ఉండేవి.. కానీ, ఇప్పుడర్దమవుతోంది. ప్రేమ అనేది ఓ గొప్ప అనుభూతి. ఆ అనుభూతిని జీవితంలో ప్రతీ ఒక్కరూ ఫీలవ్వాలి..’ అంటూ ప్రేమ పాఠాలు చెబుతున్నాడు మన ఈ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. ఇక పెళ్లి విషయానికి వస్తే, ‘జస్ట్‌ ఇప్పుడే థర్టీస్‌లోకి ఎంటర్‌ అయ్యా.. ఇప్పుడే పెళ్లేంటీ.? నేనింకా చిన్న పిల్లాడినే.. కానీ, భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటా. పెళ్లిపై నాకు మంచి అభిప్రాయముంది..’ అని చెబుతున్నాడు మన రౌడీ.

 

క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది వాలంటైన్స్‌ డేకి అపారమైన ప్రేమను పంచేందుకు ఘనంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాశీఖన్నా, ఇసాబెల్లె, ఐశ్వర్యా రాజేష్‌, కేథరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రీ రిలీజ్‌ బజ్‌ ధూమ్‌ ధామ్‌ అనేలా ఉంది. ఇక విజయ్‌ దేవరకొండ తనదైన స్టైల్‌లో ప్రమోషన్స్‌ ఇరగదీసేస్తున్నాడు. తనకున్న క్రేజ్‌ని బాగా యూజ్‌ చేసుకుంటున్నాడు. ఓ వైపు సోషల్‌ మీడియా, మరో వైపు ప్రింట్‌ మీడియా.. ఇలా ఎక్కడ చూసినా రౌడీ తన మేనియా చూపిస్తున్నాడు. చూడాలి మరి, ఈ సినిమాతో మన రౌడీ సిక్సర్‌ కొడతాడో లేదో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS