పాపం నవీన్‌కే ఎందుకిలా జరిగింది?

మరిన్ని వార్తలు

నవీన్‌ అంటే ఎవరనుకుంటున్నారా? నవీన్‌ విజయకృష్ణ. సీనియర్‌ నటుడు నరేష్‌ వారసుడు, దివంగత నటి కమ్‌ దర్శక, నిర్మాత విజయ నిర్మల ముద్దుల మనవడు. ఈయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఊరంతా అనుకుంటున్నారు'. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ హీరోగా 'నందిని నర్సింగ్‌ హోమ్‌' సినిమాతో పరిచయమయ్యాడు నవీన్‌ విజయ్‌ కృష్ణ. అయితే, ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. నిజానికి అంతకు ముందే మరో సినిమాతో రావాల్సిన నవీన్‌, కొన్ని కారణాలతో ఆల్రెడీ కొంచెం షూట్‌ చేసిన ఆ సినిమాని అక్కడే స్టాప్‌ చేసేయాల్సి వచ్చింది.

 

అలా 'నందిని నర్సింగ్‌ హోమ్‌'తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకో సినిమాకి కూడా అలాగే జరిగింది. కాన్సెప్ట్‌ క్లాష్‌ అవ్వడంతో ఆ ప్రాజెక్ట్‌ కూడా మధ్యలోనే ఆగిపోయింది. మీకో సంగతి తెలుసా.? ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా 'మహానటి'గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌, నవీన్‌ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాల్సి ఉందట.

 

కానీ, వీరిద్దరి కాంబినేషన్‌లో ఫస్ట్‌ టైమ్‌ స్టార్ట్‌ అయిన సినిమా ఆగిపోవడంతో, కీర్తి సురేష్‌కి 'నేను శైలజ..' ఆఫర్‌ రావడం అది హిట్టవ్వడం, ఆమె మహానటిగా వెలిగిపోవడం అన్నీ త్వరత్వరగా జరిగిపోయాయనీ, అన్నీ సవ్యంగా జరిగి ఉంటే, ఇది తనకు నాలుగో సినిమా అయ్యేదనీ అప్పటి సంగతులు మీడియాతో పంచుకున్నాడు నవీన్‌ విజయ్‌ కృష్ణ. ఇక ఇప్పుడు రాబోతున్న 'ఊరంతా అనుకుంటున్నారు' సినిమా అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఉంటుందని, దసరా పండక్కి అసలు సిసలు పండగలాంటి సినిమా అవుతుందని నవీన్‌ అంటున్నారు. అవసరాల శ్రీనివాస్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS