ప్రమాదంలో గాయపడ్డ నవీన్ పోలిశెట్టి

మరిన్ని వార్తలు

ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు  నవీన్ పోలిశెట్టి. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి,తరవాత హీరోగా మారాడు. హీరోగా నటించిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అందుకున్నాయి. జాతిరత్నాలు సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు.'చిచ్చోరె' సినిమాతో బాలీవుడ్ క్రిటిక్స్ ని  మెప్పించాడు. నెక్స్ట్ నితీష్ తివారి తెరకెక్కించే రామాయణంలో  కీలక పాత్రలో నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో గతేడాది అనుష్క తో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో ప్రేక్షకుల్ని అలరించాడు. ప్రజంట్ ‘అనగనగ ఒక రాజు’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నవీన్ కి సంబంధించిన న్యూస్ ఒకటి ఫాన్స్ ని తెగ కలవరపెడుతోంది. నవీన్ పోలిశెట్టికి ఆక్సిడెంట్ జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు రావటంతో, నవీన్ అభిమానులు కంగారు పడుతున్నారు.   


నవీన్ ప్రజంట్ అమెరికా ట్రిప్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ట్రిప్ లో ఉన్న నవీన్ కి అక్కడ బైక్  యాక్సిడెంట్ లో చేతికి ఫ్యాక్చర్ అయినట్లు తెలుస్తుంది. వైద్యులని సంప్రదించగా రెండు నెలలు పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. బహుశా షూటింగ్‌లో భాగంగా ఈ యాక్సిడెంట్ జరిగింది ఏమో అని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కానీ షూటింగ్ టైం లో జరిగిన ప్రమాదం కాదని, మాములుగా నవీన్ బయటికి వెళ్తున్నప్పుడు జరిగింది అని సమాచారం. చేయి ఫ్యాక్చర్ అవటంతో, నవీన్ సినిమాలకు కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వక తప్పదు. ఈ క్రమంలో తన సినిమాలు లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. 


యాక్సిడెంట్ జరిగి రెండ్రోజులు అయినట్టు నవీన్ సన్నిహితులు తెలిపారు. చేతికి అయిన ఫ్యాక్చర్ తో పాటు, మిగతా చోట్ల కూడా గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇంకా హాస్పటల్ లో ట్రీట్ మెంట్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నవీన్ ఫ్యామిలీ మెంబెర్స్ అమెరికా వెళ్లినట్లు టాక్. నవీన్ ప్రజంట్  'అనగనగా ఒక రాజు’ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈమూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలో రానుంది అనుకున్న టైం లో నవీన్ గాయ పడ్డారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS