టాక్ అఫ్ ది వీక్ – నవాబ్ & దేవదాస్

మరిన్ని వార్తలు

ఈ వారం విడుదలైన మణిరత్నం నవాబ్ & నాగ్-నానిల దేవదాస్ గురించి టాక్ అఫ్ ది వీక్ లో మాట్లాడుకుందాం...

ముందుగా మణిరత్నం నవాబ్ చిత్రం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, దర్శకుడిగా ఒక కథని చెప్పే పద్దతిలో ఆయన పట్టు తగ్గలేదు అని చెప్పొచ్చు. అదే సమయంలో సినిమా నిండా స్టార్స్ ని పెట్టుకుని వారితో తనకి నచ్చే విధంగా నటనని రాబట్టుకోవడం ఆయనకే చెల్లింది.

ఇక కథ విషయానికి వస్తే, క్రిమినల్ మైండ్ సెట్ తో ఉండేవాళ్ళు తమ బంధాలకన్నా డబ్బుకి, పవర్ కి ఎంతటి ప్రాధాన్యం ఇస్తారు అనేది పాయింట్ గా తీసుకుని తెరకెక్కించిన కథ ఇది. అయితే సినిమాలో థ్రిల్లర్ అంశాలు ఉన్నప్పటికి వాటిని సరైన విధంగా ప్రేక్షకులకి చూపించలేకపోయారు. ప్రధానంగా సినిమాలో పెద్ద ట్విస్ట్ అనుకునేది ప్రేక్షకులకి ముందుగానే తెలిసిపోవడం ఈ సినిమాకి మైనస్ గా మారిపోయింది.

నాగ్-నాని ల దేవదాస్ సినిమా గురించి మాట్లాడుకుందాం.. ఇద్దరు టాప్ హీరోలు కలిసి చేస్తున్న సినిమా అనగానే దేవదాస్ పైన అందరి అంచనాలు పెరిగిపోయాయి. ఈ తరుణంలో విడుదలైన సినిమా చూస్తే, ఒక సామజిక అంశానికి హాస్యాన్ని జోడించి తీసే ప్రయత్నం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చేశాడు.

అయితే అలా తీసే క్రమంలో సినిమా పట్టు తప్పింది. దీనితో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టయింది. ఇక నాగార్జున-నాని పాత్రలు కాస్త రిలీఫ్ ఇచ్చినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏదేమైనా ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల మెప్పుని పొందలేకపోయింది.  

ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS