బిగ్ బాస్ పై కోపంగా ఉన్న నూతన్ నాయుడు

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ముగియడానికి కేవలం ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఇక ఆఖరి రెండు రోజుల్లో బిగ్ బాస్ ఇంటిని వదిలి వెళ్ళిన సభ్యులని మరోసారి ఇంటికి పిలిపించి ఫైనల్ కి చేరిన అయుదుగురు సభ్యులతో కలిపి ఒక పార్టీ ప్లాన్ చేశారు.

దీనికి ఇంటి సభ్యులలో ఒక్కరు తప్ప అందరూ హాజరవ్వడం జరిగింది. ఇంతకి ఆ ఒక్కరు ఎవరంటే- నూతన్ నాయుడు. దీనికి సంబంధించి ఆయన ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మాట్లాడుతూ- బిగ్ బాస్ ఇంటి పార్టీకి అలాగే ఫైనల్ కి కూడా తనని బిగ్ బాస్ నిర్వాహకులు పిలిచారని, అయితే బిగ్ బాస్ వ్యవహరించిన తీరు, పక్షపాతంగా వ్యవహరించినట్టుగా అనిపించి అందుకు నిరసనగానే ఆ ఆహ్వానం తిరస్కరించారట.

ఇక తనని ఇంటిలోని మళ్ళీ వెళ్ళేందుకు సహాయం చేసిన నూతన్ నేవీ & కౌశల్ ఆర్మీ లకు తన కృతజ్ఞతలు చెప్పాడు. అయితే తన స్నేహితుడు కౌశల్ ఇంకా ఒక్కడే బిగ్ బాస్ ఇంటిలో పోరాడుతున్నాడు అని అందరూ అతని  గెలుపుకి కృషి చేయాలని, తన స్నేహితుడు టైటిల్ గెలవడం కన్నా తనకి ఇంకేమి అక్కర్లేదు అని వీడియో ముగించాడు.

ఏదేమైనా ఈ వీడియో చూసాక.. తనకి దాదాపు మూడు సార్లు బిగ్ బాస్ ఇంటిలోనికి వెళ్ళేందుకు సహకరించిన బిగ్ బాస్ పైనే కోపం పెంచుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS