మెగాస్టార్‌ కోసం నయనతార వస్తుందా?

By Inkmantra - September 14, 2019 - 14:15 PM IST

మరిన్ని వార్తలు

'సౌత్‌ క్వీన్‌'గా క్రేజ్‌ ఉంది కానీ, ప్రమోషన్స్‌కి అస్సలు కో ఆపరేట్‌ చేయదు నయనతార.. అని పెద్ద పేరుంది ఆమెకు. ఎంతటి సీనియర్‌ స్టార్స్‌ అయినా, తెలుగులో ప్రమోషన్స్‌ అస్సలు లెక్క చేయదు నయనతార. ఈ విషయమై నయన్‌పై చాలా ఆరోపణలున్నాయి. అయితే, 'సైరా' కోసం నయన్‌ తన తీరు మార్చుకోనుందట. 'సైరా' ప్రమోషన్స్‌లో నయన్‌ పాల్గొననుందని తెలుస్తోంది.

 

నిర్మాత రామ్‌చరణ్‌ స్వయంగా నయన తారను మర్యాద పూర్వంగా కన్విన్స్‌ చేసి, ప్రమోషన్స్‌కి ఆహ్వానించారట. అందులోనూ 'సైరా' మామూలు కమర్షియల్‌ మూవీ కానే కాదు. అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం. ఈ సినిమాపై గౌరవంతో ప్రమోషన్స్‌కి రావాలనుకుంటోందట నయన తార. మెగాస్టార్‌ చిరంజీవి వ్యక్తిత్వాన్ని మెచ్చుకోని వారుండరు. ఆయన కోసం కూడా నయన్‌ 'సైరా' ప్రమోషన్స్‌కి వచ్చే యోచన చేస్తోందనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ఈ సమాచారంలో ఎంత నిజముందో తెలీదు కానీ, ఒకవేళ నయన తార ప్రమోషన్సకి వస్తే, అది ఖచ్చితంగా ఆమెకు గౌరవప్రదంగా ఉంటుంది. ఫ్యాన్స్‌లో ఆమెపై ఉన్న గౌరవం మరింత పెరుగే అవకాశముంటుంది.

 

ఈ నెల 18న 'సైరా' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైద్రాబాద్‌లో ఘనంగా జరగనుంది. మరి ఆ ఈవెంట్‌కే నయన్‌ హాజరవుతుందా.? లేక సెపరేట్‌ ఇంటర్వ్యూస్‌ని ప్రిఫర్‌ చేస్తుందా.? అనేది తెలియాల్సి ఉంది. గతంలో చాలా ప్రెస్టీజియస్‌ మూవీస్‌లో నటించింది తెలుగులో నయనతార. కానీ, ఒక్క సినిమా ప్రమోషన్స్‌కీ వచ్చింది లేదు. ఇటీవల ముంబయ్‌లో 'సైరా' టీజర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌లో కూడా నయన్‌ కనిపించలేదు. సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన తమన్నా మెయిన్‌ ఎట్రాక్షన్‌ అయ్యింది అక్కడ. ఒకవేళ ఎంత చెప్పినా ఇప్పుడు కూడా నయన్‌ రాకుంటే, ఈ భారీ ఈవెంట్‌లోనూ మళ్లీ ఆ గోల్డెన్‌ ఛాన్స్‌ మిల్కీ బ్యూటీకే దక్కుతుంది అంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS