కరోనా కారణంగా దేశమంతా లాక్‌డౌన్‌లో ఉండడంతో, డైలీ లేబర్ జీవనం చాలా కష్టమైపోతోంది. ఆర్ధికంగా వెనకబడిన చాలా మందిని ఆదుకునే దిశగా ఇప్పటికే ఆయా సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఆయా సంస్థలకు చెందిన ఉద్యోగుల్ని ఆయా యాజమాన్యాలు ఆదుకుంటున్నాయి. ఆ క్రమంలోనే సినీ ఇండస్ట్రీని ఆదుకునేందుకు టాలీవుడ్ నుండి, కోలీవుడ్ నుండీ పలువురు సినీ పెద్దలు ముందుకొచ్చారు.
తాజాగా కోలీవుడ్ సినిమాకి చెందిన డైలీ లేబర్‌కి తనవంతు ఆర్ధిక సాయం అందించేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార ముందుకొచ్చింది. కరోనా కారణంగా ఆర్థికంగా బాధపడుతున్న సినీ వర్కర్స్ సంక్షేమం నిమిత్తం 20 లక్షల రూపాయలు విరాళం ప్రకటించింది. ఇప్పటికే కోలీవుడ్ నుండి చాలా మంది సెబ్రిటీలు కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు తమ వంతు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ALSO SEE :
Nayanthara Latest Photoshoot