గోపీచంద్ - తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం `సిటీమార్`. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో నడిచే కథ ఇది. గోపీచంద్, తమన్నా ఇద్దరూ కబడ్డీ కోచ్‌లుగా నటిస్తున్నారు. ఇందులో ఓ ఐటెమ్ సాంగ్ ఉంది. ఆ పాటలో ఓ ప్రముఖ కథానాయిక నటిస్తుందని ప్రచారం జరిగింది. టాలీవుడ్‌లో కొంతమంది టాప్ హీరోయిన్ల పేర్లు పరిశీలించారు. అయితే చివరికి బాలీవుడ్ భామని రంగంలోకి దించారు. తనే.. ఊర్వశీ రౌటేలాని ఎంచుకున్నారు.
బాలీవుడ్ లో ప్రత్యేక గీతాలతో తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకుంది ఊర్వశి. ఇప్పుడు అక్కడ లేటెస్టు హాట్ భామ ఊర్వశీనే. తనకి గోపీచంద్ తో ఐటెమ్ గీతం చేసే ఛాన్స్ దక్కింది. తనకిదే.. తొలి తెలుగు సినిమా. ఈ సినిమా బయటకు వస్తే.. ఊర్వశికి ఇంకా మంచి ఆఫర్లు వస్తాయని చిత్రబృందం నమ్ముతోందట. పైగా ఈ పాట కోసం ఊర్వశికి భారీ మొత్తంలో పారితోషికం ముట్టజెప్పారని టాక్.