సౌత్ సినీ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోయిన్ కు లేనివిధంగా లేడీ సూపర్ స్టార్ నయనతార వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో నయన్ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతూ ఉంది ఈ ముదురుభామ. వీరి ప్రేమాయణం చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఇద్దరూ తరచు తమ రిలేషన్ ఎలివేట్ అయ్యేలా హాలీడే ట్రిప్పులకు, పార్టీలకు వెళుతుంటారు. అయితే వీరి వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ పడే సమయం ఆసన్నమైందనే వార్తలు గత కొన్ని రోజులుగా కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
త్వరలోనే ఈ జోడీ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట. పెళ్లికి నయన్ తొందరపడకపోయినా విఘ్నేష్ శివన్ ఇంట్లో మాత్రం తొందరపెడుతున్నారట. అందుకే నయన్ పెళ్లికి రెడీ అవుతోందని, ఫిబ్రవరిలో వీరి వివాహం జరిగే అవకాశం ఉందని కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
ఆ మధ్య నయనతార జంట విదేశాలకు వెళ్లి సరదాగా గడిపి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడే వీరి ఎంగేజ్మెంట్ కూడా అయిపొయిందని కూడా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.
మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే నయన్ లేదా విఘ్నేష్ ఎవరో ఒకరు స్పందించే వరకు ఆగాల్సిందే. ఏమైనా నయనతారకు తన పెళ్లికి వార్తలు బాగా అలవాటు అయిపోయాయి. ఇక నయనతార మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'సైరా'లో సిద్దమ్మ పాత్రలో కనిపించి ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది.