సూపర్ స్టార్ రజనీకాంత్ తన 168వ చిత్రాన్ని యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. అయితే డైరెక్టర్ శివ ఈ చిత్రంలో రజనీ సరసన యంగ్ హీరోయిన్ కాకుండా వయసులో పెద్దగా కనబడే నటి అయితే బాగుంటుందని ఖుష్బూను తీసుకున్నట్లు ఇటీవలే కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం రజిని సరసన ఖుష్బూనే హీరోయిన్ గా ఫైనల్ చేసారని తెలుస్తోంది. గ్లామర్ పరంగా ఇప్పటికీ ఏ మాత్రం వంక పెట్టలేని విధంగా ఉండే ఖుష్బూ.. మరి రజిని సరసన ఈ లేట్ వయసులో ఎలా నటిస్తోందో ఎలాంటి రొమాన్స్ చేస్తోందో చూడాలి.
ఇక రజనీ గత సినిమాలు చూసినా 'కాలా'లో సీనియర్ నటి ఈశ్వరీ రావ్, 'పేటా'లో సిమ్రన్ తో కలిసి నటించారాయన. ఆ తరహాలోనే కొత్త చిత్రంలో ఖుష్బూతో జోడీ కట్టనున్నారు అన్నమాట. ఈ న్యూస్ విన్న రజిని ఫ్యాన్స్ సైతం కొంచెం సప్రైజ్ ఫీలైనా.. ఫైనల్ గా వారిద్దరి పెయిర్ చాల బాగుంటుందని అంటున్నారట. గతంలో రజనీ, ఖుష్బూలు కలిసి 'అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్' వంటి చిత్రాలు చేశారు. రజనీ మొదటిసారి శివతో చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాని రజనీతో 'రోబో, పేట' సినిమాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.