నయనతార రాజకీయాల్లోకి రాబోతోందా? ఆ సంగతేమో గానీ, నయనతార అభిమానులు మాత్రం ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. `మీరు రాజకీయాల్లోకి రావాల్సిందే` అంటూ... పట్టుపడుతున్నారు. సినిమా తారలు, రాజకీయాల్లోకి రావడం కొత్త కాదు. తమిళనాట అది అలవాటైపోయిన సంగతే. నయనతారకు ఆ చరిష్మా కూడా ఉంది. సినీ రంగంలో ఉన్నత స్థాయిని చూసింది నయనతార.
ఆమె వస్తానంటే. పార్టీ టికెట్ ఇవ్వడానికి ఎవరైనా సరే రెడీనే. నయనకు రాజకీయాలపై ఆసక్తి లేదు గానీ, ఆమెను కొంతమంది పొలిటికల్ గా టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల కోలీవుడ్ నటుడు రాధారవి... నయనతారపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇది నయన ఇమేజ్ ని డామేజ్ చేసే కుట్ర అని అక్కడి అభిమానుల వాదన. అందుకే వాళ్లంతా రివర్స్ గేర్‌లోకి వెళ్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చి, ఈ కుళ్లుని కడిగేయాలని నయనని ఆహ్వానిస్తున్నారు. మరి నయన మాటేమిటో?