ఇస్మార్ట్ శంకర్ తో ఓ సూపర్ హిట్టు కొట్టాడు పూరి జగన్నాథ్. ఇప్పుడు విజయ్ దేవరకొండ తో `లైగర్` తీస్తున్నాడు. ఆ తరవాత యష్‌తో ఓ సినిమా ఉంది. అయితే యష్ కంటే ముందుగా బాలీవుడ్ లో ఓ సినిమా చేయడానికి ఫిక్సయ్యాడు పూరి. ఇందుకు సంబంధించి.. నిర్మాతలతో ఎగ్రిమెంట్లు కూడా జరిగిపోయాయి. హీరో కూడా ఫిక్స్. త్వరలోనే ఆ సినిమాకి సంబంధించిన వివరాలు ప్రకటిస్తారు. అయితే రెండు మూడురోజుల నుంచి పూరి - నితిన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందన్న ప్రచారం ప్రారంభమైంది.
వీరిద్దరి కాంబినేషన్ లో `హార్ట్ ఎటాక్` అనే సినిమా వచ్చింది. అది ఆడలేదు. కానీ.. పూరి.. నితిన్ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారని, త్వరలోనే ఈ కాంబో సెట్ కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా కూడా లేదట. పూరి దృష్టంతా ఇప్పుడు... `లైగర్` మీద ఉందని, ఆ తరవాత బాలీవుడ్ సినిమానే అని, అది పూర్తయ్యాకే యష్ సినిమా పట్టాలెక్కుతుందని తేలింది. `జగనణమన` కూడా వీలైనంత త్వరగా మొదలెట్టాలని పూరి భావిస్తున్నాడట. ఇవన్నీ పూర్తయ్యేసరికి మరో రెండేళ్లయినా పడుతుంది.