సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌ని దక్కించుకుంది నయనతార. సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయిక తనే. లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే నయనకు 4 నుంచి 5 కోట్ల వరకూ పారితోషికం ముట్టజెప్పాల్సిందే. నయన సినిమాలకు ఆ రేంజ్‌లో డిమాండ్ ఉంది మరి. అయితే.. తాజాగా నయన తన పారితోషికాన్ని డబుల్ చేసేసిందట. ఇప్పుడు సోలో హీరోయిన్ అంటే... నయనకు పది కోట్లు సమర్పించుకోవాల్సిందే. నయనతార తాజా చిత్రం `నెట్రికన్`. దీనికి నయననే నిర్మాత. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కాబోతోంది. అందుకుగానూ.. ఓటీటీ సంస్థ ఏకంగా 20 కోట్లు అందించనుందట. ఇతరత్రా హక్కుల రూపంలో కనీసం మరో పది కోట్లు రాబట్టింది. అంటే నయన మార్కెట్ ఇప్పుడు 30 కోట్లు. అలాంటప్పుడు తనకు 10 కోట్లు ఇస్తే తప్పేమిటన్నది నయన వాదన. నయన తారని చూసే మార్కెట్ జరుగుతుంది కాబట్టి, నయనకు ఆ రేంజ్‌లో ఇవ్వడంలో తప్పులేదన్నది ట్రేడ్ వర్గాల మాట. నయనకు పది కోట్లు ముట్టజెబితే.. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికల జాబితాలో తనదే అగ్రస్థానం.