ఆ హీరోకి మరో మారు ‘నో’ చెప్పేసిందట నయనతార. ఎవరా హీరో? ఏమా కథ? ఆ హీరోతో ఇప్పటికే ఆమె నటించింది. కానీ, ఇంకోసారి ఎందుకో ఆయనతో సినిమా చేయడానికి సుముఖత వ్యక్తం చేయడంలేదట. ఆయన తమిళ హీరో.. అంటున్నారు కొందరు. కాదు, టాలీవుడ్ హీరో అంటున్నారు ఇంకొందరు. ఒక్కటి మాత్రం నిజం, నయనతార తెలుగు సినిమాల్లో నటించడానికి అంతగా ఆసక్తి చూపడంలేదు.
పెద్ద హీరోలతో సినిమా చేసే విషయంలోనూ నయనతార ఒకింత అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కారణం, సినిమా కథ అంతా తన చుట్టూనే తిరగాలని ఆమె కోరుకోవడం. పైగా, రికార్డు స్థాయి రెమ్యునరేషన్‌ని నయనతార డిమాండ్ చేస్తోంది. తనకు తాను ‘నెంబర్ వన్ హీరోయిన్’ అనే ఆలోచనతో వుందామె. అందులో కొంత నిజం కూడా లేకపోలేదు. తమిళంలో అత్యధిక రెమ్యునరేషన్ పొందుతోన్నది నయనతార కావడం గమనార్హం.
అయితే, చిన్న సినిమాలతోనే ఆమెకు ఎక్కువ రెమ్యునరేషన్ దక్కుతోంది. పైగా, ఆయా సినిమాలకు ఆమెకు తక్కువ సమయమే కేటాయిస్తోంది. అలా, తక్కువ డేట్స్‌తో ఎక్కువ సంపాదనకు నయనతార అలవాటుపడింది. ఆ పప్పులు తెలుగులో ఉడకడం కష్టమే మరి. పైగా, తెలుగు సినిమాల పబ్లిసిటీకి అస్సలామె సహకరించదు. ఇన్ని సమస్యల నడుమ, టాలీవుడ్ నుంచి ఎవరైనా ఆమెను సంప్రదించే అవకాశం వుందా.? ఛాన్సే లేదంటున్నారు చాలామంది. కానీ, ఆ హీరోని నయనతార తిరస్కరించిందంటూ ఎందుకు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోందట.?