రోజురోజుకీ మలుపులు తిరిగిన నయనతార సరోగసీ వ్యవహారం ఇప్పుడు సుఖాంతమైంది. ఈ కేసులో నయనకు క్లీన్ చిట్ లభించింది. నయనతార, విఘ్నేష్ శివన్‌ల వివాహమైన నాలుగు నెలలకే... తాము సరోగసీ ద్వారా కవల పిల్లలు కన్నారన్న విషయం బయటకు చెప్పారు. దాంతో... ఈ జంట విమర్శల పాలైంది. విఘ్నేష్, నయన్ దంపతులు సరోగసీ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఫిర్యాదులతో తమిళనాడు ప్రభుత్వం ఓ త్రిసభ్య కమిటీని నియమించింది. వాళ్లు వివిధ కోణాల్లో విచారణ జరిపి... నయనతారకు క్లీన్ చిట్ ఇచ్చారు.
తమనకు 2016లోనే పెళ్లయ్యిందని ఓ అఫిడివిట్ నయన దంపతులు కమిటీని అందించారు. 2021లో సరోగసీకి నమోదు చేయించుకొన్నారు. అయితే.. సరోగసీ చట్టం భారతదేశంలో 2022లో అమలు అయ్యింది. అందుకే కొత్త చట్టం.. నయన దంపతులకు వర్తించదని కమిటీ నిర్దారించింది. అయితే.. సరోగసీ నిర్వహించిన ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేయాలని కమిటీ ఆదేశించింది. ఐసీఎంఆర్ విధానం ప్రకారం నయన్ దంపతులకు చేసిన వైద్య పరిక్షల వివరాల్ని, అద్దె తల్లి ఆరోగ్య విషయాల్ని పొందుపరచడంలో ఆసుపత్రి యాజమాన్యం విఫలమైందని కమీటీ పేర్కొంది. అయితే సరోగసీ చేసిన వైద్యుడు మాత్రం విదేశాలకు వెళ్లిపోవడం వల్ల.. ఆయన కమిటీ విచారణకు అందుబాటులో లేకుండా పోయాడు.