తాజా కన్నడ సంచలనం... కాంతార. రూ.20 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి.. కన్నడ సీమలో కొత్త రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పటి వరకూ అన్ని భాషల్లోనూ కలిపి రూ.200 కోట్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు లెక్కగట్టాయి. కన్నడ సీమనుంచి వంద కోట్లు, మిగిలిన అన్ని భాషల్లోనూ మరో వంద కోట్లు సాధించినట్టు టాక్. కే జి యఫ్ సినిమా టోటల్ రన్ లో దాదాపుగా 230 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డు ని కాంతార దాటుకుని వెళ్లిపోవడం ఖాయం.
ఐతే కేజియఫ్ తో పోలిస్తే... కాంతార బడ్జెట్ చాలా తక్కువ. ప్రచారం కూడా పెద్దగా చేసింది లేదు. ఐనప్పటికీ ఈ స్థాయి లో వసూళ్లు దక్కించుకుందంటే అది మామూలు విషయం కాదు. రూపాయి పెట్టుబడి పెడితే ఏకంగా పది రూపాయల లాభం కళ్లచూడడం... గొప్ప విషయమే. అందుకే... కాంతార చరిత్రలో గొప్ప సినిమాగా నిలిచిపోయింది.