నయనతార ఆ పాత్రలోనా?

మరిన్ని వార్తలు

సౌత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ నయనతార. గ్లామరస్‌ పాత్రలకే కాదు, ఛాలెంజింగ్‌ పాత్రలకూ నయనతార ఫస్ట్‌ ఆప్షన్‌గా నిలుస్తుంది. అలాంటిది తాజాగా నయనతార ఓ ఛాలెంజింగ్‌ రోల్‌ పోషిస్తోందిప్పుడు. నెల్సన్‌ దిలీప్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 'కొలమావు కోకిల' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. 

కోకిల పాత్రలో నయనతార కనిపించబోతోంది. యోగి బాబు నయన్‌కి జంటగా నటిస్తున్నాడు కాగా, ఇదో డిఫరెంట్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న చిత్రం. ఈ చిత్రంలో నయనతార డ్రగ్స్‌ అమ్మే యువతిలా కనిపించబోతోంది. ఆర్ధికంగా కష్టాల్లో ఉన్న యువతి, తప్పని పరిస్థితుల్లో ఎలా స్మగ్లింగ్‌ వైపు మళ్లింది. అది ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? అనే అంశంపై చాలా హృద్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. నయనతార నటనలో మరో గొప్ప కోణం ఈ సినిమా ద్వారా ఆవిష్కృతమవుతుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది. 

నయన్‌ నటించిన తమిళ చిత్రాలు తెలుగులోనూ అనువాదమవుతాయి. అలా లేటెస్టుగా తెలుగులో విడుదలైన 'కర్తవ్యం' చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే తెలుగులో ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ అయిన 'సైరా నరసింహారెడ్డి'లో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. మెగాస్టార్‌ 151వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. కొణిదె ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రామ్‌చరణ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నా సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS