లేడీ సూపర్ స్టార్ నయనతార కెరియర్ పదేళ్ల కిందటే అయిపోయింది అన్నారు అంతా. నయన్ కూడా బాలకృష్ణతో చేసిన శ్రీ రామ రాజ్యం సినిమాతరవాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామనుకుంది. ఇదే చివరి సినిమా అని కూడా ప్రచార జరిగింది. ప్రభుదేవాతో మనస్పర్థలు రావటంతో ఆ బంధం బీటలు వారింది. కుంగి పోయి ఇంటికే పరిమితం అయిపోకుండా సివంగిలా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ సారి మొదటి ఇన్నింగ్స్ కంటే క్లిక్ అయ్యింది. మొదట గ్లామర్ డాల్ గా పేరు పొంది, అలాంటి పాత్రలకే పరిమితం అయిన నయన్ సెకండ్ ఇన్నింగ్స్ లో లేడి ఓరియెంటెడ్ మూవీస్ చేయటం మొదలు పెట్టింది. అనుకున్న దానికంటే ఎక్కువ విజయం సాధించింది.
దీనితో కేవలం నయన్ ని దృష్టిలో పెట్టుకుని ఫీమేల్ సెంట్రిక్ స్టోరీస్ రాసిన వారు కూడా ఉన్నారు. పైగా ఎలాంటి పాత్ర ఇచ్చినా వందకి వంద శాతం న్యాయం చేకూర్చటంతో మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన నయన్ లో అసలైన నటనని చూసారు ప్రేక్షకులు. ఒక వైపు కమర్షియల్ సినిమాలు మరో వైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలతో నయన్ జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. లేటెస్ట్ గా జవాన్ సినిమాతో బాలీవుడ్ లో షారుక్ తో కలిసి నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అవటంతో బాలీవుడ్ నుంచి అమ్మడికి పలు ఛాన్స్ లు వచ్చినా వాటికి నో చెప్తోంది.
ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాలపైనే ఫోకస్ చేస్తోందని టాక్. ఈ క్రమంలోనే మూడు ఫీమేల్ సెంట్రిక్ కథలకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. టాలెంటెడ్ దర్శకుడు శశి కుమార్ తెలుగు తమిళంలో హీరోగా, దర్శకుడిగా మంచి పేరు పొందాడు. ఇతను మంచి స్టోరీ వినిపించడంతో నయన్ కి ఆ కాన్సెప్ట్ నచ్చి ఓకే చేసిందని తెలుస్తోంది. నెక్స్ట్ లోకేష్ కనగరాజ్ శిష్యుడు విష్ణు అనే మరో కొత్త దర్శకుడికి కూడా ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. విష్ణు నయన్ ఇమేజ్ తగ్గా కథని వినిపించడంతో కొత్తవాడు అయినా ఛాన్స్ ఇచ్చిందట. విజయ్ సేతుపతి తో రీసెంట్ గా మహారాజ తీసి సూపర్ సక్సెస్ సాధించిన నితిలన్ సామినాధనతో ఒక ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. లేడీ ఓరియేంటెడ్ నేపథ్యంలో అద్భుత, కథ కథనంతో ఉండటంతో ఎలాంటి సందేహాలు లేకుండా సామినాధన్ కి ఓకే చెప్పిందట నయన్.