పెళ్లి కాకుండానే పిల్ల‌ల్ని కంటుందా?

మరిన్ని వార్తలు

సినిమావాళ్లు ఏం చేసినా ట్రెండీగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్లు ట్రెండ్ ఫాలో అవ్వ‌రు, సెట్ చేస్తారు. తాజాగా న‌య‌న‌తార కూడా ట్రెండ్ సెట్ చేసే ప‌నిలో ప‌డింది. న‌య‌న తార ప్రేమ‌, పెళ్లి, వ్య‌క్తిగ‌త జీవితం ఎప్ప‌టి నుంచో హాట్ టాపిక్‌. త‌న ప్రేమ‌క‌థ‌ల గురించి.., చిత్ర‌సీమ క‌థ‌లు క‌థ‌లుగా చెబుతుంటుంది. ఇప్పుడు మ‌రోసారి న‌య‌న విష‌యం.. హాట్ హాట్ గా చ‌ర్చించుకుంటున్నారు. న‌య‌న శింభుతోనూ, ప్ర‌భుదేవాతోనూ ప్రేమాయ‌ణం న‌డిపిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్ తో స‌హ జీవనం చేస్తోంది. వీరిద్ద‌రూ గ‌ప్ చుప్‌గా పెళ్లి చేసుకున్నార‌ని కూడా వార్త‌లొచ్చాయి.

 

అయితే వాటిని న‌య‌న ఎప్ప‌టిక‌ప్పుడు త్రోసి పుచ్చుతూనే వ‌చ్చింది. తాజాగా న‌య‌న‌పై మ‌రో గాసిప్ చ‌క్క‌ర్లు కొట్టింది. న‌య‌న - విశ్నేష్ విడిపోయారని, త‌న మూడో ప్రేమ‌క‌థ కూడా బ్రేక‌ప్ అయ్యింద‌ని చెప్పుకున్నారు. అయితే... ఈమ‌ధ్య విఘ్నేష్ ఓ ట్వీట్ చేసి, ఈ రూమ‌ర్ల‌కు చెక్ పెట్టే ప్ర‌యత్నం చేశాడు.

 

అంతేకాదు,.. కొత్త చ‌ర్చ‌కు తెర తీశాడు. `నా పిల్ల‌ల‌కు కాబోయే త‌ల్లి` అంటూ న‌య‌న‌తార‌ని ఉటంకిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వార్త‌ల్లో నిలిచింది. అంటే న‌య‌న - విఘ్నేష్‌ల బంధం ఇంకా అలానే స్ట్రాంగ్‌గా ఉంద‌న్న‌మాట‌. త్వ‌ర‌లోనే న‌య‌న్ తల్లి కూడా కాబోతోంద‌న్న‌మాట‌. అంటే.. న‌య‌న - విఘ్నేష్ పెళ్లి కాకుండానే తల్లి అవ్వ‌బోతోంద‌న్న‌మాట‌. ప్ర‌స్తుతానికైతే ఆ ట్వీట్ ఈ విష‌యాలే చెబుతున్నాయి. పెళ్లి కాకుండానే త‌ల్లి అవ్వ‌డం, ఆ త‌ర‌వాత పెళ్లి చేసుకోవ‌డం సినిమాల్లోనే చూస్తుంటాం. ఇప్పుడు సినిమా వాళ్ల జీవితాల్లో చూడ‌బోతున్నాం. అంతే తేడా. మ‌రి.. ఈ విష‌యంలో న‌య‌న్ ఎలా స్పందిస్తుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS