నయనతార ‘పెళ్ళి’ కబురు ఎప్పుడు చెబుతుందంటే..

మరిన్ని వార్తలు

నయనతార పెళ్ళి చేసుకునేదెప్పుడు.? అని ఆమె అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అది ఆమె ఇష్టం. అయినాగానీ, నయనతార - విఘ్నేష్‌ శివన్‌ మధ్య చాలాకాలంగా ప్రేమాయణం నడుస్తోంది. ఇద్దరూ కలిసి సహజీవనం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రచారమేంటి, ఇది నిజం కూడా.. అని పలు సందర్భాల్లో ఈ ఇద్దరూ పరోక్షంగా సంకేతాలు పంపారు. తాజాగా, తన పిల్లలకు నయనతార తల్లి అవుతుందంటూ అసలు విషయాన్ని విఘ్నేష్‌ శివన్‌ చాలా స్పష్టంగా చెప్పేశాడు.

 

పిల్లలు సరే, పెళ్ళి సంగతేంటి.? అనడిగితే మాత్రం ఈ ఇద్దరి నుంచీ సమాధానం దొరకడంలేదు. ‘అది మా వ్యక్తిగత అంశం. మేం పెళ్ళి చేసుకుంటామా.? లేదా.? అన్నది సమయం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది..’ అని పలు సందర్భాల్లో విఘ్నేష్‌, నయన్‌ చెప్పుకొచ్చారు. ఇదిలా వుంటే, ఈ ఏడాది చివర్లోనే నయన - విఘ్నేష్‌ వైవాహిక బంధంతో ఒక్కటవబోతున్నారనీ, ఈ నేపథ్యంలో ‘పిల్లల ప్రస్తావన’ విఘ్నేష్‌ శివన్‌ నుంచి వచ్చిందనీ అంటున్నారు. మరోపక్క, నయనతార గర్భవతి.. అంటూ కొన్ని గాసిప్స్‌ కోలీవుడ్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. అయితే, నయనతార సన్నిహితులు మాత్రం, ఈ గాసిప్స్‌లో నిజం లేదంటున్నారు. ప్రస్తుతం నయనతార పెళ్ళి గురించిగానీ, పిల్లల గురించిగానీ ఆలోచించడంలేదనీ, ఆమె పూర్తిగా కెరీర్‌ మీదనే ఫోకస్‌ పెట్టారన్నది వారు చెబుతున్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS