రాజా రాణి, బెంగుళూరు డేస్ లాంటి క్లాస్ సినిమాలతో ఆకట్టున్న హీరోయిన్ నజ్రియా నజీమ్. అయితే పెళ్లి చేసుకొని కొంత కాలం సినిమాలకి దూరమైయింది. ఇప్పుడు నేరుగా తెలుగులో ఎంట్రీ ఇస్తుంది,. నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'అంటే సుందరానికి..'. వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది నజ్రియా.
తాజాగా నజ్రియా డబ్బింగ్ కూడా పూర్తయింది. సినిమా అనుభవాన్ని వివరిస్తూ ఓ పోస్ట్ రాసింది. ముఖ్యంగా దర్శకుడు వివేక్ ఆత్రేయపై తన అభిమానం వెల్లడించింది. వివేక్ ని తాతయ్య అని ముద్దుగా పిలుచుకుంది.''వివేక్ లాంటి దర్శకుడితో పని చేయడం గొప్ప అనుభూతి. ఏడాది పైగా ప్రయాణం చేశాం. ఈ ప్రయాణంలో ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను. వివేక్ డైరెక్షన్ ని మిస్ అవుతున్నా. లీలా థామస్‌ని కూడా మిస్ అవుతున్నా'' అని రాసుకొచ్చింది నజ్రియా. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా లీలా థామస్ అనే పాత్ర చేసింది నజ్రియా. జూన్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.