మంచు లక్ష్మీ ప్రసన్న ఆచి తూచి సినిమాలు చేస్తుంటారు. ఆమె నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా హిందీతోపాటు తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు ఉంది. హాలీవుడ్ లో కూడా సినిమాలు చేశారు. తాజాగా మలయాళంలోనూ మెరిశారు. మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘మాన్‌స్టర్’లో లక్ష్మీప్రసన్న ఓ కీలక పాత్ర పోషించారు.
హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమాలో మంచు లక్ష్మీ పాత్ర షాకింగా వుంది. దుర్గ ఆయాగా పరిచయమైన ఆ పాత్రలో షాకింగ్ ఎలిమెంట్స్ వున్నాయి. ఇందులో హోమ్ సెక్సువల్ పాత్రలో కనిపించింది మంచు లక్ష్మీ. కథలో ‘మాన్‌స్టర్’ అంటే ఆమె పాత్రనే అనిపించింది. మోహన్ లాల్ తో ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా వుంది. మోహన్ లాల్ కి ధీటుగా మంచు లక్ష్మీ ఫైట్ చేసిన విధానం ఆకట్టుకుంది. క్రైమ్ థ్రిల్లర్ రూపొందిన ఈ చిత్రంలో మోహన్ లాల్, మంచు లక్ష్మీ, హనీ రోజ్ ల నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.