ఈరోజు (అక్టోబర్ 23) నాగచైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా మేకర్స్ శుభకాంక్షలు తెలుపుతూ ... అభిమానులు, సినీ ప్రేమికులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రానికి "కస్టడీ"అనే పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేసారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్ లో కనిపించారు.
నిజాయితీ, దృఢ నిశ్చయంతో ఉన్న పోలీస్ ఆఫీసర్ "ఎ. శివ" పాత్రలో, అతను చూడాలనుకునే మార్పు కోసం అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడతాడని పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది. శివ తాను నమ్మే విధానం కోసం తన స్వంత వ్యవస్థతో పోరాటం చేస్తాడని ఫస్ట్ లుక్ లో స్పష్టమౌతోంది.