కళ్లు చెదిరే రెడ్ షార్ట్ గౌనులో మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మని గుర్తు పట్టారా? సుమంత్ హీరోగా తెరకెక్కిన 'గోదావరి' చిత్రంలో సుమంత్ మరదలిగా నటించిన అందాల భామ నీతూ చంద్ర. అచ్చమైన తెలుగమ్మాయిగా చక్కగా కనిపించింది ఆ సినిమాలో. ఆ తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్‌తో ఓ సినిమాలో నటించింది. తర్వాత తెలుగులో ఎక్కడా కనిపించలేదు. కానీ తమిళంలో అమ్మడికి హాట్భామగా మంచి పేరుంది. కానీ అవకాశాలే అరుదుగా ఉన్నాయ్. భాషతో సంబంధం లేకుండా మంచి అవకాశాలొస్తే ఎక్కడైనా నటించేందుకు సిద్ధమంటోందీ బ్యూటీ. హీరోయిన్‌గానే కాదు, ఐటెం సాంగ్స్‌కీ సై అంటోంది. ఆల్రెడీ సూర్య హీరోగా నటించిన 'సింగం' సిరీస్‌లో ఐటెం సాంగ్ చేసేసింది. ఒళ్లు విరుచుకుని ఏక్రోబాటిక్ బాడీతో ఓ పాటకి నీతూ చంద్ర వేసిన స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కానీ ఆ పాట నీతూకి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయింది. దాంతో అమ్మడి హాట్ స్టెప్పులకు విలువ లేకుండా పోయింది.