విలన్‌గా మారిన సీనియర్‌ హీరోయిన్‌.!

మరిన్ని వార్తలు

ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన అందాల భామ సిమ్రాన్‌. దాదాపు స్టార్‌ హీరోలందరి సరసన ఆడి పాడింది. కుర్రకారుకు సిమ్రాన్‌ అంటే కెవ్వుకేక. అలాంటి సిమ్రాన్‌ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఈ మధ్యనే తమిళ సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. కెరీర్‌ ఎండింగ్‌లో తెలుగులో కమెడియన్‌ కృష్ణ భగవాన్‌కి జోడీగా నటించిన సిమ్రాన్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. 

ఏకంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలో అవకాశం దక్కించుకుంది. సీనియర్‌ స్టార్‌ హీరోలందరితోనూ నటించిన సిమ్రాన్‌, ఒక్క రజనీకాంత్‌తోనే నటించలేదు. ఆ కోరిక సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నెరవేరబోతున్నందుకు సిమ్రాన్‌ తెగ సంతోషపడిపోతోందట. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రజనీకాంత్‌ తాజా చిత్రంలో సిమ్రాన్‌ నటిస్తోంది. అయితే సిమ్రాన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌ కాదు. కీలక పాత్ర పోషిస్తోందట. అది కూడా నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రట. ఈ పాత్ర కోసం సిమ్రాన్‌ని ఏరి కోరి ఎంచుకుందట చిత్ర యూనిట్‌. 

ఇకపోతే తెలుగులోనూ సిమ్రాన్‌ రీ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో సీనియర్‌ హీరోయిన్ల హవా కొనసాగుతోందిప్పుడు. ఆల్రెడీ చాలా మంది సీనియర్‌ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చారు. అత్తగా, అమ్మగా, విలన్స్‌గానూ అలరిస్తున్నారు. ఆ కోవలో ఆల్రెడీ ఉన్న అత్తమ్మలకు భవిష్యత్తులో సిమ్రాన్‌ గట్టి పోటీ ఇస్తుందేమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS