స్విమ్మింగ్‌ పూల్‌లో విరిసిన గ్లామర్‌ పద్మం!

మరిన్ని వార్తలు

అబ్బా పిక్‌ ఎంత అందంగా ఉందీ అనుకుంటున్నారుగా. ఇంతకీ స్విమ్మింగ్‌ పూల్‌లో పింక్‌ కలర్‌ పద్మం లాంటి యాక్సెసరీపై బికినీలో వయ్యారాలు పోతున్న ఈ గ్లామర్‌ ఎవరిదా.. అనే కదా మీ డౌట్‌. స్క్రీన్‌పై అందాలారబోసే అందాలభామ ఎంతమాత్రమూ కాదు. తెర వెనక పాటలు పాడే ప్లేబ్యాక్‌ సింగర్‌. ఈ పాటికే అమ్మడి పేరు అర్ధమైపోయి ఉంటుంది. యస్‌, ఎగ్జాట్లీ ఆమెనే. నేహా బాసిన్‌. ఈవిడగారి గాత్రం ఎంత సుమధురంగా ఉంటుందో, అంతుకు మించిన గ్లామర్‌తో కళ్లు చెదరగొట్టేస్తుంటుంది.

 

అందుకే సింగర్స్‌ అందు నేహా బాసిన్‌ వేరయా అనకుండా ఉండలేము. ఏ ప్లేబ్యాక్‌ సింగర్‌కీ లేని గ్లామర్‌ టాలెంట్‌ ఈ సింగర్‌కి ఉంది మరి. అందుకే ఆమె ఇన్‌స్టా ఫాలోవర్స్‌ లెక్క తెలిస్తే షాకవ్వాల్సిందే. ఇకపోతే, తాజాగా ఈ బ్యూటీ ఇదిగో సమ్మర్‌ వెకేషన్‌ని ఇలా ఎంజాయ్‌ చేస్తోంది. బాలీవుడ్‌ ప్రొఫిషనల్‌ సింగర్‌ అయిన నేహాబాసిన్‌, తెలుగు, తమిళ తదితర భాషల్లోనూ తన టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకుంది. అప్పుడప్పుడూ తన గ్లామర్‌ని పాప్‌ సింగింగ్‌ షోస్‌లో ప్రదర్శిస్తుంటుంది. పిక్‌ విషయానికి వస్తే, బ్లూ కలర్‌ పూల్‌ వాటర్‌లో పింక్‌ కలర్‌ ఫ్లవర్‌ డిజైన్డ్‌ ఎయిర్‌ బెలూన్‌పై చెమ్కీ బ్లూ కలర్‌ టూ పీస్‌ బికినీలో నేహా అందం హాట్‌గా బాసిల్లుతోంది కదా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS