'సైరా' కోసం ప‌ని పూర్తి చేసిన స్వీటీ

మరిన్ని వార్తలు

'సైరా'లో అనుష్క కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే 'సైరా' సెట్లో కూడా స్వీటీ అడుగుపెట్టింది. ఇంత‌లోనే...త‌న ప‌ని తాను పూర్తి చేసేసింది. అవును.. `సైరా`లో అనుష్క ఎపిసోడ్ల‌న్నీ తెర‌కెక్కించేశారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో అనుష్క‌, చిరంజీవి, త‌మ‌న్నాల‌పై కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించార‌ని తెలుస్తోంది. అనుష్క‌పై ఓ పాట కూడా ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

 

అయితే... అలాంటిదేం లేద‌ని, అనుష్క కేవ‌లం కొన్ని స‌న్నివేశాల‌కే ప‌రిమితం అయ్యింద‌ని స‌మాచారం. మ‌రోవైపు 'సైరా' చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి కావొచ్చింది. రెండు పాట‌లు మిన‌హా ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింద‌ని తెలుస్తోంది. ఈనెల‌లోనే 'సైరా'కి గుమ్మ‌డికాయ కొట్టేయ‌డం ఖాయ‌మ‌ని, అక్టోబ‌రు 2న విడుద‌ల చేస్తార‌ని చెప్పుకుంటున్నారు. ఒక‌వేళ అక్టోబ‌రు దాటిందంటే - సైరా వ‌చ్చేది 2020 సంక్రాంతికే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS