నటీనటుల ప్రేమవ్యవహారాలు పై సినీ ప్రేక్షకులకి ఎప్పుడు ఆసక్తి ఉంటూనే ఉంటుంది. ఇక మీడియాకి అయితే ఆ ఆసక్తి ఇంకాస్త ఎక్కువ!
వివరాల్లోకి వెళితే, నటీ నేహ ధూపియాని పెళ్ళి ఎప్పుడు అని ప్రశ్నించగా, తాను ఎవరితోనైనా ప్రేమలో పడితే ఆ విషయాన్ని ప్రెస్ నోట్ గా విడుదల చేస్తాను అని అలాగే తాను ఉన్న బిజీకి తన సహచరిని ప్లేన్ లో గాని జిమ్ లో గాని కాలవాలేమో అని చమత్కరించింది.
ఇక తనని ఫ్యాన్స్ కాకుండా స్నేహితులు, కుటుంబసభ్యులు కూడా పెళ్ళి గురించి అడుగుతున్నారు అని వీటన్నిటికి సమాధానం సమయమే చెప్పాలి అని నిట్టూర్చింది.
ఇక నేహ ధూపియా ప్రస్తుతం ఒక టాక్ షో ని నిర్వహిస్తున్నది అలాగే కొన్ని కమర్షియల్స్ లో నటిస్తున్నది.