బాలీవుడ్‌లో 'జూలీ' సినిమాతో పెను సంచలనాలకు కారణమైన హాట్ బ్యూటీ నేహా దూపియాకి పెళ్లయిపోయింది. అందాల పోటీ నుండి సినిమాల్లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్‌లోనూ రాణించింది. తర్వాత బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. ఈమె పెళ్లి చేసుకుందని తెలిసి అభిమానులు షాక్ అయ్యారు. తమ హాట్ ఫేవరేట్ నటికి పెళ్లయిపోయిందే అని వాపోయారు.
మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కొడుకు అంగద్‌ను ఢిల్లీలోని గురుద్వార్‌లో నేహా దూపియా వివాహమాడింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఓ సినిమాలో నటించింది. తరుణ్ హీరోగా నటించిన 'నిన్నే ఇష్టపడ్డాను' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ రకంగా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలే. ప్రస్తుతం బాలీవుడ్‌లో పెళ్లి సందడి నెలకొంది. వరుసపెట్టి ముద్దుగుమ్మలు పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారైపోతున్నారు. వీటిలో అన్నీ షాకింగ్ వెడ్డింగ్సే కావడం విశేషం.
మొన్నటికి మొన్న ముద్దుగుమ్మ అనుష్క ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీని వివాహమాడి అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తుందిలెండి. లేటెస్టుగా బాలీవుడ్ స్టైల్ ఐకాన్ సోనమ్ కపూర్ వివాహం జరిగింది. ఈ ముద్దుగుమ్మ కూడా పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చే యోచన లేదంటోంది. అలాగే ఇప్పుడు నేహా దూపియా కూడా.
మరో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉందని తెలుస్తోంది. ఇటీవలే తన బోయ్ ఫ్రెండ్‌ని అభిమానులకు పరిచయం చేసింది కానీ పెళ్లి సంగతి ఇంకా అఫీషియల్‌గా తెలియచేయలేదు. చూడాలి మరి, ముందు ముందు బాలీవుడ్‌లో ఇంకెవరెవరు పెళ్లి పీటలెక్కనున్నారో.!