దగ్గుబాటి అభిరామ్ కి బెదిరింపులు

మరిన్ని వార్తలు

ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమని ఒక కుదుపు కుదిపిన అంశం- కాస్టింగ్ కవుచ్. ఆ అంశంలో నటి శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆమె బయటపెట్టిన కొన్ని ఫోటోలు, పేర్లు అందరిని విస్తుపోయేలా చేశాయి.

ఇక ఈ సందర్భంగా బయటకి వచ్చిన పేరు దగ్గుబాటి అభిరామ్. శ్రీ రెడ్డి తో సన్నిహితంగా అభిరామ్ ఉన్న ఫోటోలు ఆమె బయటపెట్టడంతో ఒక్కసారిగా అందరి దృష్టి అభిరామ్ పైన పడ్డాయి. ఈ విషయాన్నీ సొమ్ము చేసుకోవాలని కొందరు ఒక ప్లాన్ చేసారు.

ఆ వివరాల్లోకి వెళితే, దగ్గుబాటి అభిరామ్ ఎక్కడికి వెళుతున్నాడో గమనించి అతని ఫోన్ తస్కరించి అందులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి అభిరామ్ ని బెదిరించాలి అని స్కెచ్ వేశారు ఓ నలుగురు. అందులో భాగంగానే గత వారం ఆయన ఒక రెస్టారెంట్ కి వచ్చినప్పుడు ఫోన్ ని దొంగిలించి అందులోని సమాచారాన్ని సంపాదించారు. ఇక ఆ సమాచారాన్ని బయటపెడతామని అభిరామ్ ఇ-మెయిల్ కి బెదిరింపు మెయిల్స్ ఇవ్వడం మొదలుపెట్టారు.

ఇలా జరగకూడదు అనుకుంటే తమకి రూ 1.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీనితో వెంటనే సురేష్ బాబు ఈ అంశాన్ని సైబర్ క్రైం పోలీసులకి సమాచారం ఇవ్వడంతో నలుగురు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురు నిరుద్యోగులే అని తెలిసింది. కేవలం డబ్బు కోసమే ఈ ప్లాన్ వేసినట్టుగా పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS