గ్లామ్‌షాట్‌: 'చిరుత' పాపా.. ఇస్టైల్‌ కెవ్వుకేకా.!

మరిన్ని వార్తలు

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ డెబ్యూ మూవీ 'చిరుత'తోనే ఈ పాప కూడా డెబ్యూ చేసింది. పేరు నేహా శర్మ. అన్నీ ఉన్నా, ఇంకేదో అన్నట్లుగా గ్లామర్‌కి గ్లామర్‌, క్యూట్‌నెస్‌కి క్యూట్‌నెస్‌, పర్‌ఫామెన్స్‌కి పర్‌ఫామెన్స్‌, డాన్సింగ్‌ టాలెంట్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే, అన్నీ ఉన్నా అమ్మడికి అవకాశాలే కరువయిపోయాయి. 'చిరుత' తర్వాత స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకోగల సత్తా ఉందని తెలుగు ప్రేక్షకులు అంచనా వేశారు. కానీ, విధి బలీయమైంది. నేహా శర్మకు ఓ మోస్తరు ఆదరణ కూడా దక్కలేదు టాలీవుడ్‌లో. తర్వాత బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. కానీ, అక్కడ కూడా వర్కవుట్‌ కాలేదు. దాంతో తన దగ్గర ఉన్న అరుదైన అస్త్రం గ్లామర్‌ని ఎరగా వేసి, సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ సంపాదించింది.

హాట్‌ హాట్‌ పిక్స్‌తో ఆల్వేస్‌ నెట్టింట్లో హుషారుగా కనిపిస్తుంటుంది. అమ్మడి గ్లామర్‌ హుషారుకి ఓయబ్బో నెటిజన్లు ఎప్పటికప్పుడే ఫిదా అయిపోతుంటారు. తాజాగా వెకేషన్‌ ఎంజాయ్‌మెంట్‌లో భాగంగా, దిగిన ఈ ఫోటోల్ని తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. చూస్తున్నారుగా, బ్రైట్‌ గ్రీన్‌ కలర్‌ మోడ్రన్‌ కట్‌ ఫ్రాక్‌లో హ్యాండ్‌ బ్యాగ్‌ ధరించి స్టైల్‌గా బాల్కనీలో ఎలా స్మైల్‌ ఇస్తూ పోజిచ్చిందో.! ఆ నవ్వుకు నాలుగు కోట్లు.. అనేట్లు లేదూ. ఇక బ్యాక్‌ గ్రౌండ్‌లో ఆ సీనరీ ఆహ్లాదాన్ని పంచేలా ఉంది. టోటల్‌గా నేహా స్మైల్‌ అండ్‌ స్టైల్‌ కేక పుట్టిస్తున్నాయిలే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS