రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'లో హీరోలుగా నటిస్తున్న ఎన్టీఆర్, చరణ్‌లు హైద్రాబాద్‌లో లేరు. మరి ఎక్కడున్నట్లు? అల్లూరిగా నటిస్తున్న రామ్ చరణ్ ఫ్టైట్‌లో వీడియో గేమ్ ఆడుకుంటూ కనిపించాడు. కొమరం భీమ్ ఎన్టీఆర్ ఏమో ఫ్టైట్ ఎక్కేందుకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నాడు. అదీ సంగతి. ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్' షూటింగ్ వైజాగ్‌లో జరగనున్నట్లు సమాచారం అందుతోంది. వైజాగ్‌లోని పాడేరు మోదకొండమ్మ ఆలయ ప్రాంగణంలో కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్‌పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ విశాఖకు ప్రయాణం కట్టారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్‌లో ఎన్టీఆర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క చరణ్ కూడా ఫ్టైట్‌లో వీడియో గేమ్ ఆడుతున్న ఫోటోల్ని తానే ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఎక్కడకు వెళుతున్నదీ వివరణ ఇవ్వలేదు కానీ, ఫ్లైట్ మోడ్ అనే క్యాప్షన్‌తో ఆ పిక్స్ పోస్ట్ చేశాడు చరణ్. ఇంతవరకూ 'ఆర్‌ఆర్‌ఆర్'కి సంబంధించి ఎలాంటి ప్రచార చిత్రాలు విడుదల కాలేదు. కానీ, ఎన్టీఆర్ సరసన నటించబోయే విదేశీ భామ ఒలివియా మోరిస్‌తో పాటు, మరికొంత మంది విదేశీ నటీనటుల పేర్లను రాజమౌళి టీమ్ పోస్టర్స్ రూపంలో విడుదల చేసింది. త్వరలోనే 'ఆర్‌ఆర్‌ఆర్'కి సంబంధించి ఓ బెస్ట్ సర్‌ప్రైజ్ రానుందని తెలుస్తోంది. ఆ సర్‌ప్రైజ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, చరణ్‌కి జోడీగా నటిస్తుండగా, తమిళ నటుడు సముద్ర ఖని, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.