నేహా శర్మ క్లీవేజ్‌ హాట్‌నెస్‌

By iQlikMovies - March 22, 2018 - 18:19 PM IST

మరిన్ని వార్తలు

అవకాశాల కోసం హాట్‌నెస్‌ ప్రదర్శించడం అనేదిప్పుడు చాలా ఫ్యాషన్‌ అయిపోయింది. అయితే ఒక్కోసారి ఆ ఫ్యాషన్‌ షోకి తగ్గ రిజల్ట్‌ కూడా దక్కుతోంది. అంటే హాట్‌ హాట్‌ ఆఫర్స్‌ అన్నమాట. 

'చిరుత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాట్‌గా హాయ్‌ చెప్పిన బ్యూటీ నేహా శర్మ. అయితే హాట్‌ అండ్‌ మెగా పవర్‌స్టార్‌ ఎంట్రీ అయినా కానీ, అమ్మడికి పాపం లక్కు అంతగా చిక్కలేదు. తెలుగులో 'చిరుత' తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయాయి. బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయినా కానీ అంతంతమాత్రమే అయ్యింది. 

అయితే ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ సూపర్‌ యాక్టివ్‌ అయిపోయింది. హాట్‌ హాట్‌ ఫోటోస్‌తో కుర్రకారుకు మత్తెక్కించే కిక్కిస్తోంది. దాంతో అమ్మడికి భారీ ఆఫర్సేవో చిక్కబోతున్నాయనే సిగ్నల్స్‌ అందుతున్నాయి. అయితే అది తెలుగులోనా? హిందీలోనా? మరే ఇతర భాషలోనా? అనేది తెలియాల్సి ఉంది. 

ఏది ఏమైనా ఈ తాజా పిక్‌లో నేహాశర్మ అందాలు నిజంగానే మత్తెక్కిస్తున్నాయ్‌లే. క్యూట్‌ ఫేస్‌తో, క్లీవేజ్‌ గ్లామర్‌తో అహో నేహా నీ అందాలదిరెలే.! అనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS