ఎట్టకేలకి వీడియో చూపించిన రాజమౌళి

By iQlikMovies - March 22, 2018 - 18:11 PM IST

మరిన్ని వార్తలు

రాజమౌళి-రామ్ చరణ్-ఎన్టీఆర్.. ఈ ముగ్గురు కలిసి సినిమా చేస్తున్నారు అని అందరూ అంటున్నా సరే వీరు మాత్రం ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు.

ఇక ఎట్టకేలకి కొద్ది నిమిషాల ముందు ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా అధికారిక ప్రకటన ఒక వీడియో రూపంలో రాజమౌళి విడుదల చేశాడు. ఇందులో #RRR అనే వర్కింగ్ టైటిల్ కనిపిస్తుంది. అంటే R-రాజమౌళి, R- రామ్ చరణ్ & R- రామ రావు అంటూ ముగ్గురు పేర్లు కలిసి వచ్చేలా ఒక టైటిల్ ని డిజైన్ చేసి విడుదల చేశాడు.

అలాగే ఈ సినిమా నిర్మించేది మాత్రం DVV ఎంటర్టైన్మెంట్స్ అని మాత్రం తేలిపోయింది. దీనితో ఈ #RRR కి సంబందించిన అధికారిక ప్రకటనలు ఇప్పటినుండి మనకి ఒక్కొకటి అందబోతున్నాయి అన్న క్లారిటీ వచ్చేసింది.

మునుముందు ఇంకా ఈ సినిమాకి సంబందించిన నటీనటులు, టెక్నికల్ కాస్ట్ గురించిన వివరాలు ఏ విధంగా తెలియచేయనున్నారో అన్నది వేచి చూడాలి...

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS