బ్లాక్‌ హాట్‌ చిరుత బ్యూటీ.!

మరిన్ని వార్తలు

గ్లామర్‌తో అవకాశాలు కొల్లగొట్టొచ్చుననే అభిప్రాయం ప్రతీ హీరోయిన్‌కీ ఉంటుంది. అదే అభిప్రాయాన్ని అచ్చంగా అలా ఫాలో అయిపోతోంది మన చిరుత పాప. అదేనండీ 'చిరుత' సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో కలిసి తెలుగు సినిమాకి పరిచయమైన ముద్దుగుమ్మ నేహాశర్మ. తెరంగేట్రం అయితే మెగా రేంజ్‌లో ఉన్నా, ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఒక్క అవకాశమూ రాలేదీ ముద్దుగుమ్మకి. ఆ తర్వాత బాలీవుడ్‌ అవకాశాల కోసం విశ్వప్రయత్నాలు చేసింది. కానీ అక్కడ కూడా అమ్మడికి చుక్కెదురైంది. దాంతో మళ్లీ తెలుగులో అవకాశాల కోసమే ప్రయత్నాలు మొదలెట్టింది. అందుకే సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోయి కనిపిస్తూ, దర్శక, నిర్మాతలకు సన్నగా వల విసురుతోంది. ఈ మధ్య బికినీల్లో ఫ్రీ షోలు ఇస్తూ, పిచెక్కిస్తోంది. పాపం ముందు వాటి సంగతి వదిలేస్తే, తాజాగా స్విమ్మింగ్‌ పూల్‌లో బ్లాక్‌ హాట్‌ టాప్‌లో తనలోని అందాలను ఎరగా వేసి, సెగలు పుట్టిస్తోన్న అమ్మడి ప్రయత్నాలు ఫలించి, ఒక్క ఛాన్స్‌ ఒకే ఒక్క ఛాన్స్‌ అయినా ఇస్తే బావుండు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS