బ్రైట్ పింక్ కలర్ గాగ్రా చోళీలో మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మని గుర్తు పట్టారా.? అక్షరాలా 'చిరుత' పిల్ల నేహా శర్మనే. డిఫరెంట్ హెయిర్ స్టైల్ కారణమో, లేక ఇంకేదైనా కారణమో తెలీదు కానీ, పాపని ఈ గెటప్‌లో గుర్తు పట్టడం కూసింత కష్టంగా ఉంది. కానీ, గ్లామర్ అయితే కిర్రాక్ ఉంది. గ్రాండ్‌గా యాక్సెసరీస్ ధరించి మెరిసిపోతోంది. మెడలో ధరించిన నిండైన నక్లస్ ఆమె అందాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. బ్యూటిఫుల్ అంటే అర్ధం ఇదే అనిపించేలా ఉంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అదరగొట్టేస్తున్నాయి. ఇక ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ పిచ్చెక్కించేస్తోంది.
రోజా రేకుల్లాంటి ఆ లిప్స్ కుర్రకారుకు చక్కిలిగింతలు పెట్టేస్తున్నాయి. చెవిపై పడుతున్న ఆ నీలాల కురులను చేతితో అలా సుతారంగా పక్కకు నెడుతూ ఇచ్చిన ఫోటో పోజు మతులు పోగొడుతోంది. తెలుగులో ఒకటి రెండు సినిమాలతోనే దుకాణం కట్టేసిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో అలా అలా అప్పుడప్పుడూ ఒకటీ అరా సినిమాలతో సరిపెట్టుకుంటోంది. నెట్టింట్లో హాట్ ఫోటో సెషన్స్ విషయంలో అస్సలు నిరాశపరచదు. ప్రస్తుతం ఈ తాజా పిక్‌కి హ్యూజ్ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది.