హాట్‌ అండ్‌ క్యూట్‌ 'చిరుత' పిల్ల

మరిన్ని వార్తలు

తొలి సినిమాకే పూరీ హీరోయిన్‌ అనిపించుకుంది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో జత కట్టింది. అదేనండీ 'చిరుత'తో క్యూట్‌ అండ్‌ హాట్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నేహా శర్మ గుర్తింది కదా. ఇరగదీసి ఎక్స్‌పోజింగ్‌ చేసింది. డాన్సులు కూడా చరణ్‌కి ధీటుగా అదరగొట్టేసింది ఈ సినిమాలో. అయితే తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. వరుణ్‌ సందేశ్‌తో 'కుర్రాడు' చిత్రంలో నటించింది. కానీ అంది అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు అమ్మడికి. హిందీ, మలయాళ చిత్రాల్లోనూ తర్వాత తన అదృష్టం పరీక్షించుకుంది. 

తాజాగా మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. 'సోలో' టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా సోషల్‌ మీడియాలో ఇలా హాట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోతే, అవకాశాలు అందుకోవచ్చని ఎవరో చెప్పారట లేటెస్టుగా ఈ ముద్దుగుమ్మకి. అందుకే ఇలా ట్రై చేస్తోందట. అయితే ప్రస్తుతానికి లిమిట్స్‌లోనే గ్లామర్‌ ఒలకబోసిన ఈ బ్యూటీ ముందు ముందు హాట్‌నెస్‌ పెంచేయనుందేమో చూడాలి. ఎన్ని చేసినా అవకాశాల కోసమే కదా. ఏమాటకమాటే చెప్పుకోవాలి కానీ ఈ ఫోటోలో, ఎల్లో కలర్‌ కాస్ట్యూమ్‌లో నేహా శర్మ అందం భలే మెరిసిపోతోందిలే!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS