'నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ మరియు సోనూ ఠాకూర్, ఎస్ వి కృష్ణా రెడ్డి, బాబా భాస్కర్
దర్శకత్వం : శ్రీధర్ గాధే
నిర్మాత: కోడి దివ్య దీప్తి
సంగీత దర్శకుడు: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి
ఎడిటర్: ప్రవీణ్ పూడి


రేటింగ్ : 2/5


రాజావారు రాణిగారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం లాంటి చిత్రాలతో యువతలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. 'సెబాస్టియ‌న్‌’ మాత్రం మిస్ ఫైర్ అయ్యింది. అయితే ‘స‌మ్మత‌మే’తో మళ్ళీ యూత్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇప్పుడు కిరణ్ నుండి 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్‌.ఆర్‌.క‌ల్యాణ‌మండ‌పం’ త‌ర్వాత శ్రీధ‌ర్ - కిర‌ణ్‌ల కాంబినేష‌న్‌లో రూపొందిన రెండో చిత్రమిది. ద‌ర్శకుడు కోడి రామ‌కృష్ణ త‌న‌యురాలు కోడి దివ్య దీప్తి ఈ సినిమాతో నిర్మాతగా మారడం మరో విశేషం. పాజిటివ్ వైబ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథ ఏంటో చూద్దాం. 


కథ:


వివేక్‌(కిరణ్‌ అబ్బవరం) ఓ క్యాబ్‌ డ్రైవర్‌. అతనికి ఓ సాఫ్ట్‌వేర్‌ అమ్మాయి తేజు(సంజనా ఆనంద్‌) పరిచయం అవుతుంది. తేజు ఓ కుర్రాడిని ప్రేమించి మోస‌పోతుంది. దీంతో కుటుంబానికి ముఖం చూపించలేక మ‌ద్యానికి బానిస‌వుతుంది. తేజు తాగి ప‌డిపోయిన ప్రతిసారీ ఆమెను త‌న రూంలో డ్రాప్ చేస్తుంటాడు వివేక్. ఓసారి ఆమెను ఓ గ్యాంగ్‌ కిడ్నాప్ చేయ‌బోతే కాపాడ‌తాడు. దీంతో ఆమెకు వివేక్‌పై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. త‌న కథని అత‌నితో పంచుకుంటుంది. అదే స‌మ‌యంలో వివేక్ కూడా త‌న కథని చెప్తాడు. అసలు అతని పేరు వివేక్ కాదు పవన్ అని చెబుతాడు. అసలు పవన్, వివేక్ గా ఎందుకు మారాడు ? తేజు ని ప్రేమించి మోసం చేసింది ఎవరు ? చివరికి తేజు, వివేక్ ఒక్కటయ్యార లేదా అనేది మిగతా కథ. 


విశ్లేషణ:


కథ వినడానికి కొత్తగా లేకపోయినా యూత్ ఫుల్ ట్రాక్ లోనే వుంది. ఒక అమ్మాయి ప్రేమలో విఫలమై తాగి పడిపోతుంటుంది. మరో అబ్బాయి ఆమెకు దగ్గరౌతాడు. అతనికి కూడా ఒక కథ వుంటుంది. కిరణ్ అబ్బారవం లాంటి హీరో ఈ పాయింట్ ని చేస్తున్నపుడు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ట్రీట్ చేస్తే దాని రిజల్ట్ పాజిటివ్ గా వుండేది. కానీ ఈ పాయింట్ ని పరమ రొటీన్ మాస్ మసాలా సినిమాగా ట్రీట్ చేశారు. దీంతో ఎలాంటి కొత్త అనుభూతిని ఇవ్వలేని, ఇది వరకే చూసిన సన్నివేశాలు, డైలాగ్స్ తో పరమ పాత సినిమాలా తయారైయ్యాడు బాగా కావాల్సిన వాడు. 


హీరోయిన్ కథలో గానీ అటు హీరో ఫ్లాష్ బ్యాక్ లో ఎలాంటి సంఘర్షణ వుండదు, కొత్తదనం మాట పక్కన పెడితే పాత్రలలో ఏ మాత్రం ఎమోషన్ వుండదు. కిరణ్ చేసిన ఎస్‌ఆర్‌ కల్యాణమండపంలో కూడా మాస్ ఎలిమెంట్స్ వున్నాయి. అయితే వాటిని వాడిన విధానంలో ఒక కొత్తదనం వుంది. కానీ ఇందులో మాత్రం హీరోని మాస్ మూలవిరాట్ ని చేసి మాస్ కా బాప్ అన్నట్టు చూపించడం అస్సల్ నప్పలేదు.


నిజానికి కిరణ్ కి అంత మాస్ ఇమేజ్ రాలేదు. బాబా భాస్కర్ తో కలసి డిజైన్ చేసిన సన్నివేశాలు ఓవర్ యాక్షన్ అనిపించడానికి కారణం ఇదే. పైగా ఈ కథని ఒక పెద్ద మాస్ కమర్షియల్ సినిమాగా తీయాలనే ప్రయత్నం జరిగింది. కానీ దానికి తగ్గ సెటప్ మాత్రం కుదరలేదు. దీంతో సన్నివేశాలు, డైలాగులు ఎక్కడి నుండో తెచ్చిపెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. అక్కడక్కగా కిరణ్ తన టైమింగ్ తో కాస్త వినోదం పంచినా ఓవరాల్ గా మాత్రం ప్రేక్షకులకు కావాల్సిన సినిమా మాత్రం కాదిది.


నటీనటులు :


కిరణ్ లో మంచి ఈజ్ వుంది. తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ తన ఇమేజ్ కి పొంతనలేని కథ తీసుకోవడం ప్రతికూలంగా మారింది. డ్యాన్సుల్లో పర్వాలేదనిపించాడు. తేజు పాత్రలో సంజనా ఆనంద్ ఓకే. లాయర్ దుర్గాగా సోనూ అందంగా వుంది. బాబా భాస్కర్‌, ఎస్వీ కృష్ణారెడ్డి త‌దిత‌రుల పాత్రలు ప‌రిధి మేర‌కు వున్నాయి.


సాంకేతిక వర్గం:


ఈ సినిమా పెద్ద ఉపసమనం మణిశర్మ మ్యూజిక్. నేపధ్య సంగీతం, పాటల్లో మణిశర్మ ఆకట్టుకుంటారు. రాజ్ నల్లి ఛాయాగ్రహణం డీసెంట్ గా వుంది. కిరణ్ అబ్బవరం రాసిన మాటలు, స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ లేదు. నిర్మాణ విలువలు ఓకే. 


ప్లస్ పాయింట్స్ 


కిరణ్ అబ్బవరం 
మణిశర్మ మ్యూజిక్ 


మైనస్ పాయింట్స్ 


రొటీన్ కథ , కథనాలు 
పేలవమైన పాత్రలు 
సంఘర్షణ లేకపోవడం 


ఫైనల్ వర్దిక్ట్ : ప్రేక్షకులకు కావాల్సిన వాడు కాదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS