మల్టీప్లెక్స్ లో సినిమా చూస్తే బాగానే ఉంటుంది కాని అక్కడ బ్రేక్ సమయంలో ఏదైనా కొనుక్కొని తినాలంటే మాత్రం సామాన్యులకి చుక్కలు కనిపించడం మాత్రం నిజం.
ఎందుకంటే- మల్టీప్లెక్స్ లలో MRPలతో అసలు ఏమాత్రం సంబంధం లేకుండా తినుబండారాలని అమ్మేయడం, అక్కడ ఏంటి ఇది అని ప్రశ్నిస్తే మల్టీ ప్లెక్స్ ట్యాక్స్ అని వేరే ట్యాక్స్ అని ఏవేవో చెబుతూ వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టేస్తుంటారు.
మల్టీప్లెక్స్ లో అధిక ధరలకి చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ ని క్షుణ్ణంగా పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం, అందులోని లీగల్ చిక్కులని పూర్తిగా అధ్యయనం చేశాక ఒక కొత్త పాలసీ కి రూప కల్పన చేయటం జరిగింది.
అదేంటంటే- ఆగష్టు 1 నుండి మల్టీప్లెక్స్ లో సినిమా చూడడానికి వెళ్ళే సమయంలో బయటనుండి ఆహారం తీసుకెళ్ళే వెసులుబాటుని కల్పిస్తున్నారు. ఇదే క్రమంలో మల్టీప్లెక్స్ లో కూడా ఆహార పదార్ధాలని MRP ధరలకే అమ్మాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ వారికి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఈ ఆదేశాలు పాటించకపోతే, ప్రభుత్వం సదరు మల్టీప్లెక్స్ పైన తగు చర్యలు తీసుకుంటుంది అని ఆ పాలసీ లో ఉంది. ఇది ఒకరకంగా సినీ అభిమానులకి శుభవార్త అనే చెప్పొచ్చు.