అభిమానులకి గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్

By iQlikMovies - April 02, 2018 - 17:12 PM IST

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానులకి రంగస్థలం రూపంలో ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. అది సరిపోలేదు అని అనుకున్నాడో ఏమో కాని అభిమానులకి ఇంకొక బహుమతి ఇవ్వాలి అని అనుకున్నాడు.

ఆ వివరాల్లోకి వెళితే, రంగస్థలం విడుదలకి ముందు సినిమా నిడివి ఎక్కువ అవుతుంది అన్న నేపధ్యంలో ఒక 10 నిమిషాల ట్రాక్ ని పక్కకి పెట్టారట. ఇప్పుడు ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆ 10 నిమిషాలని సినిమాలో పెట్టబోతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపారు.

కొద్దిసేపటి క్రితం రంగస్థలం చిత్ర యూనిట్ ద్వారా థాంక్స్ మీట్ జరిగింది. ఆ థాంక్స్ మీట్ లో అభిమానులకి, ప్రేక్షకులకి, మీడియాకి అలా ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది.

అయితే ఈ థాంక్స్ మీట్ కాకుండా మరో మూడు రోజుల్లో ఈ చిత్రానికి సంబందించిన విజయోత్సవ సంబరాలు మొదలుకానున్నాయట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS