కథానాయిక భావన కిడ్నాప్, తదనంతర పరిణామాలూ యావత్ చిత్రసీమని కలవరపాటుకి గురిచేశాయి. హీరోయిన్ల భద్రతపై మరోసారి నీలి మేఘాలు కమ్ముకొనేలా చేస్తున్నాయి. ఎవరిని నమ్మాలో... ఎవరిని నమ్మకూడదో అర్ధం కాని పరిస్థితి. భావనని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు? ఆ రోజు నిజంగా ఏం జరిగింది? అనే విషయాలపై కేరళ పోలీసులు కూపీ లాగుతున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ దాడిలో పాల్గొన్నవాళ్లకూ, భావనకు ఇది వరకు పరిచయం ఉందట. వాళ్ల మధ్య సంబంధాలు బెడసి కొట్టడంతో.. ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. కిడ్నాప్ బృందంలో వ్యక్తులంతా ఇండ్రస్ట్రీకి చెందినవాళ్లేనని, ఆ ముగ్గురూ గతంలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసినట్టు వార్తలొస్తున్నాయి. మరో వైపు భావనపై లైంగిక దాడి చేస్తున్నప్పుడు వీడియో చిత్రీకరించినట్టు ప్రచారం జరిగింది. అయితే... ఈ విషయంపై పోలీసులు ఇప్పటి వరకూ స్పందించలేదు. ఆ వీడియా... అగంతులు ఏం చేసినట్టు?? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.