ఆర్జీవీ లక్ష్మీ పార్వతిని దించేశారు.!

By iQlikMovies - January 12, 2019 - 11:08 AM IST

మరిన్ని వార్తలు

రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'లక్ష్స్మీస్‌ ఎన్టీఆర్‌'లో లక్ష్మీపార్వతి పాత్రలో పోషించే నటి ఎవరో అంటూ ఆశక్తిగా ఎదురు చూశారు అభిమానులు. ఎట్టకేలకు ఆ పాత్రను రివీల్‌ చేశాడు వర్మ. కన్నడ భామ ఈ పాత్ర పోషిస్తుందని తెలిసింది. కానీ ఇప్పటి వరకూ పేరు తెలియలేదు. అయితే పేరుతో పాటు, పిక్‌ కూడా రిలీజ్‌ చేసి, వర్మ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆమె పేరు యజ్ఞాశెట్టి. వర్మ సినిమాల్లోని హీరోయిన్లు నేచురల్‌ లుక్స్‌తో ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే రియల్‌ స్టోరీలను తెరకెక్కించేటప్పుడు వర్మ తీసుకొచ్చే నటీనటులు రియల్‌ క్యారెక్టర్స్‌కి పోలికల్లోనూ, నటనలోనూ కూడా చక్కగా అతికిపోతారు.

 

అలాగే లక్ష్మీ పార్వతి పాత్ర కోసం యజ్ఞాశెట్టి ఎంపిక వర్మ విజన్‌కి మరోసారి నిదర్శనం. అయితే ఈ యజ్ఞాశెట్టి ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. వర్మ తెరకెక్కించిన 'వీరప్పన్‌' మూవీలో వీరప్పన్‌కి భార్య పాత్ర పోషించిన నటి ఈమెనే. ఇకపోతే ఈ సినిమాలో మరో ఆశక్తికరమైన పాత్ర చంద్రబాబు పాత్ర. ఈ పాత్రలో యంగ్‌ హీరో శ్రీతేజ్‌ కనిపించబోతున్నారు.

 

ఈయన లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఎన్టీఆర్‌ కథా నాయకుడు'లో దివంగత వైఎస్సార్‌ పాత్ర పోషించారు. అన్నట్లు ఈయన వర్మ డైరెక్షన్‌లో గతంలో 'వంగవీటి' సినిమాలో దేవినేని నెహ్రూ పాత్రను పోషించి మెప్పించారు. తన ప్రతీ సినిమాకి కొత్త నటీనటుల్ని పరిచయం చేసే వర్మ ఈ సారి పరిచయం ఉన్న నటీనటుల్నే ఎంచుకోవడం గమనార్హం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS