2017లో వార్తల్లో నిలిచిన ఫిల్మ్ స్టార్స్ జాబితా ఇదే

మరిన్ని వార్తలు

సినిమా కబుర్లు అంటే ఎప్పూడు ఇంట్రస్టింగ్ టాపిక్కే. సెలబ్రిటీల ప్రతి అప్డేట్ ను తెలుసుకోవాలనే ఆసక్తి కనబరుస్తుంటారు ఫ్యాన్స్. వారికి సంబధించిన ఏ వార్తనైనా ఆసక్తికరంగా చదువుతుంటారు. అలాగే 2017లో న్యూస్ మేకర్స్ గా నిలిచిన వారి లిస్టు పరిశేలిస్తే...

సమంత- నాగచైతన్యల పెళ్లి దాదాపు ఈ ఏడాది మొత్తం నడిచిన న్యూస్. చాలా కాలం సస్పెన్స్ లో పెట్టేసిన సామ్- చైతు ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటు హిందూ ఇటు క్రిస్టియన్ ఆయన వీరి జంట చూడముచ్చటగా రెండు సంప్రాదాయాల్లో వైభవంగా పెళ్లి చేసుకొంది. చాలా కాలంలో ప్రేమలో విహరించిన ఈ జంట మొత్తానికి2017లో పవిత్రభందంలో అడుగుపెట్టేసింది.



రాజమౌళి హిట్ డైరెక్టర్. ఆయనకి అపజయాలు లేవు. తీసిన ప్రతి సినిమా హిట్టే. ఈ హిట్లన్నీ ఒక ఎత్తు. బాహుబలి మరో ఎత్తు. ఏ ముహూర్తాన రాజమౌళి బాహబాలి సినిమా మొదలుపెట్టాడో గానీ అప్పటి నుండి రాజమౌళి పేరు మార్మోగిపోయింది ఎప్పుడు లేనంతగా. ఇక సినిమా విడుదల తర్వాత నేషనల్ లెవల్ మీడియాలో బిగ్ న్యూస్ గా నిలిచారు రాజమౌళి. ఆయన్ని ఇండియన్ సీల్బర్గ్ గా అభివర్ణించారు కొందరు. 2017లో సెన్సేషనల్ దర్శకుడు ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా రాజమౌళి పేరు చెప్పకతప్పదు.



2017లో న్యూస్ మేకర్స్ లో నిలిచిన మరో పేరు అర్జున్ రెడ్డి అలియాస్ విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో ఒక్కసారి వందమెట్లు ఎక్కేశాడు విజయ్ దేవరకొండ. అంతకుముందు వచ్చిన పెళ్లి చూపులు విజయ్ కి ఒక హిట్ ఇస్తే.. అర్జున్ రెడ్డి మాత్రం విజయ్ ని వార్తల్లో నిలిపింది. యూత్ లో ఎక్కడ చూసిన అర్జున్ రెడ్డి గా విజయ్ దేవర కొండ కబుర్లే. కొందరు అయితే విజయ్ ని యూత్ సూపర్ స్టార్ అని కూడా అభివర్ణించేశారు.



టాలీవుడ్ కి ఎంతో మంది దర్శకులువస్తుంటారు పొతుంటారు. కొంతమంది మాత్రం అబ్బా.. ఏం తీశాడ్రాబాబు అని వావ్ అనిపించుకుంటారు. అలా 2017లో మెరిసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డితో న్యూస్ మేకర్ గా నిలిచాడు సందీప్. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అని కీర్తించారు కొందరు. 'శివతో రామ్ గోపాల్ ట్రెండ్ సెట్ చేశాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి తో మరో పాత్ బ్రేకింగ్ సినిమా అందించాడు సందీప్' అని అభివర్ణించారు వారూ వున్నారు. కాదు ప్రయోగం, రియాలిటీ పేరుతో పచ్చి బూతు సినిమా తీశాడు అని విమర్శించవారూ లేకపోలేదు. ఏదేమైనా సందీప్ వంగా ఈ ఏడాది బిగ్ న్యూస్ మేకర్.



ఈ ఏడాది న్యూస్ లో మరో నిలిచిన మరో పేస్ రాహుల్ రామకృష్ణ. బేసిగ్గా జర్నలిస్ట్ అయిన రాహుల్.. 'సిన్మా' అనే షార్ట్ ఫిల్మ్ తో నటుడుగా మారాడు. ఈ షార్ట్ ఫిల్మ్ ఎంత మందికి చేరువ అయిందో కానీ.. అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా రాహుల్ దశ తిరిగింది. ఇందులో అర్జున్ రెడ్డి స్నేహితుల్లో ఒకరిగా కనిపించిన రాహుల్.. 'ఎవరీకుర్రాడు భలే చేస్తున్నాడే'అని కితాబు అందుకున్నాడు. ఈ రకంగా  టాలీవుడ్ కి మరి మంచి నటుడు దొరికాడని నమ్మకాన్ని కలిగించాడు రాహుల్ రామకృష్ణ.



శివబాలాజీ గురించి పరిచయ వాఖ్యలు అక్కర్లేదు. హీరో సినిమాలు చేసి అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పెటు తెచ్చుకున్నాడు శివబాలాజీ. అయితే కొంతకాలంగా సైలెంట్ గా కనిపించిన శివబాలాజీ ఒక్కసారిగా న్యూస్ లోకి వచ్చాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్ విజేతగా. ఈ ఏడాది తెలుగులో లాంచ్ అయిన ఈ షో విజేతగా నిలిచాడు శివబాలాజీ. వాస్తవానికి బాలాజీ విన్ అవుతాడని చాలా మంది ఉహించలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సునామీలా ఓట్లు కురిపించారని ఓ వాదన వినిపించింది. ఏదేమైనా బిగ్ బాస్ తొలి విజేతగా శివబాలాజీ ఓ రికార్డ్ సెట్ చేశాడు.   



‘క్వాంటికో' అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికోతో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా దశ తిరిగింది. ఈ సీరిస్ కోసం హాలీవుడ్ కి మకాం మార్చేసిన ప్రియాంక అక్కడ ఇక్కడ క్రేజీ స్టార్ అయిపోయింది. క్వాంటికో సిరీస్ తో ఆమె పేరు హాట్ టాపిక్ అయ్యింది. ఆమె ఏం చేసిన ఒక హాట్ టాపిక్కే. లైంగిక వేధింపులు గురించిన మాట్లాడిన , డ్రెస్ సెన్స్ గురించి చెప్పినా, ఫోర్బ్స్ జాబితాలో నిలిచనా..  ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్నా.. ఇవన్నీ పిగ్గీచాప్స్ కే చెల్లాయి. 2017లో ప్రియాంక కంటే మంచి పెద్ద న్యూస్ మేకర్ బాలీవుడ్ లో కనిపించలేదు అంటే అతిశయోక్తి లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS