ప్రేమకి కులం, మతం, డబ్బుతో పనిలేదు. వయసుతో కూడా పనిలేదని... మన కథానాయికలు నిరూపిస్తుంటారు. సినిమాల్లో. తమ కంటే ఇంచుమించు డబుల్ వయసున్న హీరోలతో పీకల్లోతు ప్రేమలో పడిపోవడం వాళ్లకు అలవాటే. బయట కూడా అంతే. వయసు చూసుకోరు. స్కూలు రోజుల్లోనే ప్రేమలో పడిన కథానాయికలకు లెక్కేలేదు. ఇస్మార్ట్ శంకర్ కథానాయిక నిధి అగర్వాల్ కూడా అంతేనట. నాలుగో తరగతిలోనే ప్రేమకథ మొదలెట్టేసిందట. నిధి. ఈ విషయాన్ని తనే చెప్పింది.
``నాలుగో తరగతిలోనే ఓ అబ్బాయిని ఇష్టపడ్డా. అది ఇష్టం, ప్రేమ అనే విషయాలు అప్పుడు తెలీదు. కొంచెం పెద్దయ్యాక ఒకరితో డేటింగ్ చేశా. ఒకరి వల్ల... హృదయం బద్దలైపోయింది. అయినా సరే, తట్టుకుని నిలబడ్డా`` అంటూ తన ప్రేమకథల్ని పంచుకుంది నిధి. ఇప్పుడు ప్రేమపై అభిప్రాయాలు పెద్దగా మారకపోయినా, ఎవనినీ ప్రేమించడం లేదని, సినిమాలపైనే తన ధ్యాస అని చెప్పుకొచ్చింది.