నిధి అగర్వాల్.. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన హిందీ సినిమా 'మున్నామైఖెల్'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయింది. లాక్‌డౌన్ టైమ్‌ను వెస్ట్ చేయకుండా న్యూయార్క్ ఫిల్మ్ కోర్సును ఆన్‌లైన్‌లో నేర్చుకుంటుంది.
తాజాగా నిధి అగర్వాల్.. కరోనా పై పోరాటంలో భాగంగా తన వంతు సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా పీఎం కేర్స్‌తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కరోనా క్రైసిస్ ఛారిటీకి తన వంతు విరాళం అందజేసింది. దాంతో పాటు జంతువులకు సంబంధించిన వెల్ఫేర్ ఆప్ స్ట్రే డాగ్స్‌తో పాటు స్పూర్తి సంక్షేమ సంఘంతో పాటు సీఎం రిలీఫ్ పండ్‌కు విరాళం అందజేసిసట్టు ప్రకటించింది.